ఐఏఎస్ అంటూ పెళ్లి చేసుకున్నాడు.. కట్ చేస్తే 6ఏళ్లకు బయటపడ్డ అసలు బాగోతం..

| Edited By: Srikar T

Jul 11, 2024 | 9:46 AM

తాను ఒక ఐఏఎస్ అధికారి అని నమ్మించిన కేటుగాడి అసలు బాగోతం ఆరు సంవత్సరాల తర్వాత బయటపడింది. సైబరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018లో మాట్రిమోనీ సైటులో తన ప్రొఫైల్ ను అప్డేట్ చేశాడు. తాను ఒక ఐఏఎస్ అధికారులు అంటూ అందులో పేర్కొనడంతో హైదరాబాద్‎కు చెందిన ఒక ప్రొఫెషనల్ ఉద్యోగిని ఫేక్ ఐఏఎస్‎పై ఇంట్రెస్ట్ చూపించింది. దీంతో ఇద్దరూ కలిశాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఐఏఎస్ అంటూ పెళ్లి చేసుకున్నాడు.. కట్ చేస్తే 6ఏళ్లకు బయటపడ్డ అసలు బాగోతం..
Ias
Follow us on

తాను ఒక ఐఏఎస్ అధికారి అని నమ్మించిన కేటుగాడి అసలు బాగోతం ఆరు సంవత్సరాల తర్వాత బయటపడింది. సైబరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018లో మాట్రిమోనీ సైటులో తన ప్రొఫైల్ ను అప్డేట్ చేశాడు. తాను ఒక ఐఏఎస్ అధికారులు అంటూ అందులో పేర్కొనడంతో హైదరాబాద్‎కు చెందిన ఒక ప్రొఫెషనల్ ఉద్యోగిని ఫేక్ ఐఏఎస్‎పై ఇంట్రెస్ట్ చూపించింది. దీంతో ఇద్దరూ కలిశాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2018లో వీరికి వివాహమైంది ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి కోసం కట్నంగా 50 లక్షల రూపాయలతో పాటు బంగారాన్ని ఇచ్చారు.

ఈ తరుణంలోనే తనకు ఐఏఎస్ ఉద్యోగం ఇష్టం లేదని తాను రేడియాలజీలో ఎండి చేస్తాను అంటూ భార్యను నమ్మించాడు. తాను చేస్తున్న ఉద్యోగం ద్వారా తనకి 40 కోట్ల రూపాయలు జీతంగా వచ్చిందని. ఈ మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాలో ఉంచటంతో ఇన్ కమ్ టాక్స్ అధికారులు తన బ్యాంక్ అకౌంట్‎ను ఫ్రీజ్ చేశారని భార్యను నమ్మించాడు. తన అకౌంట్ డీ ఫ్రీజ్ కావాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సిందని ఇన్ కమ్ టాక్స్ అధికారులు చెప్పారని ఆమెను నమ్మించాడు. ఇది నిజమేమో అని నమ్మిన భార్య తన భర్త కోసం రెండు కోట్ల రూపాయలను వివిధ మార్గాల్లో అర్ధించి ఆయనకు ఇచ్చింది. కట్టుకున్న భార్య దగ్గర రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాడు డబ్బు మొత్తాన్ని తన తల్లిదండ్రులు తన సోదరీ బ్యాంకు ఖాతాలకు మళ్ళించాడు.

ఇదే క్రమంలో అదనపు కట్నం కావాలని తన భార్యను వేధించడం ప్రారంభించాడు. ఇప్పటికే చాలా ఇచ్చానని ఇకమీదట ఇచ్చేది లేదని ఆమె చెప్పటంతో ఆమెపైనే ఎదురు తిరిగాడు. భర్త సందీప్ వేధింపులు తాళలేక బాచుపల్లి పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అసలు బాగోతాన్ని బయటపెట్టారు. అప్పటివరకు తాను 2016 బ్యాచ్‎కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అంటూ అందరినీ నమ్మించాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం బయటపడింది. అసలు తాను ఐఏఎస్ఏ కాదని విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. నకిలీ ఐఏఎస్‎గా చలామణి అవుతుండటంతో నిందితుడు సందీప్‎తో పాటు ఆయన తండ్రి విజయ్ కుమార్‎ను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..