Viral Video: వాయువేగంతో వచ్చి ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిన బైక్‌.. ఒళ్లు గగ్గుర్లు పొడిచే వీడియో!

ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన మనుషులు తిరిగి ఇంటికి చేరుకునే వరకు నమ్మకం లేకుండా పోతుంది. కొన్నిసార్లు మనం మంచిగా వెళ్ళిన కూడా ఎదుటి వారి అజాగ్రత్త, అతి వేగం వల్ల కొంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. వాయువేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు.

Viral Video: వాయువేగంతో వచ్చి ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిన బైక్‌..  ఒళ్లు గగ్గుర్లు పొడిచే వీడియో!
Viral Video

Edited By: Anand T

Updated on: Nov 20, 2025 | 7:03 PM

బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలను వాయువేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో.. స్పాట్‌లోనే భర్త మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.. ఈ ప్రమాద దృశ్యాలు వెనకాల వస్తున్న కారు డ్యాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగేళ్లపల్లి మండలం.. మండేపల్లి గ్రామానికి చెందిన జడల తిరుపతి, జడల రజిత అనే భార్యాభర్తల సిద్దిపేటలో బంధువులు చనిపోవడంతో, అంతక్రియలకు హాజరవుదామని మండేపల్లి నుండి జక్కాపూర్ మీదుగా సిద్దిపేటకు బైక్ పై వెళ్తున్నారు. వారు జక్కాపూర్ గ్రామ శివారులోకి రాగానే.. రాంగ్‌రూట్‌లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఒక్కసారిగా వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వాళ్లబైక్‌ గాల్లోకి ఎగిరి పడిపోయింది.

ఈ ప్రమాదంలో భర్త తిరుపతి అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య రజిత తీవ్రంగా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు గాయపడిన మహిళను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని,వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.