తెలంగాణలో 5 లక్షల రేషన్ కార్డ్స్ బ్యాన్!

| Edited By: Pardhasaradhi Peri

Jan 01, 2020 | 10:42 AM

తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల రేషన్ కార్డ్స్ రద్దు అయినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో రేషన్‌ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ పార్లమెంట్ స్థాయి సంఘం గుర్తించింది. 2016 నుంచి 2018 మధ్య దాదాపు 5,21,790 కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపింది. అయితే.. ఈ కార్డులన్నీ 2016 సంవత్సరంలోనే రద్దు చేశారని, ఆ తర్వాత రెండేళ్లలో అంటే 2017, 18లలో రద్దు చేయలేదని […]

తెలంగాణలో 5 లక్షల రేషన్ కార్డ్స్ బ్యాన్!
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా 5 లక్షల రేషన్ కార్డ్స్ రద్దు అయినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో రేషన్‌ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ పార్లమెంట్ స్థాయి సంఘం గుర్తించింది. 2016 నుంచి 2018 మధ్య దాదాపు 5,21,790 కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపింది. అయితే.. ఈ కార్డులన్నీ 2016 సంవత్సరంలోనే రద్దు చేశారని, ఆ తర్వాత రెండేళ్లలో అంటే 2017, 18లలో రద్దు చేయలేదని పేర్కొంది. అయితే అవన్నీ నకిలీ రేషన్స్‌ కార్డ్స్‌గా కేంద్ర ఆహార శాఖ గుర్తించిందని.. అందుకే వాటిని రద్దు చేసినట్టు సమాచారం.