High Court: బీటెక్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు అర్హులేః హైకోర్టు తీర్పు

|

Dec 20, 2021 | 8:00 PM

Gurukul TGT Posts: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

High Court: బీటెక్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు అర్హులేః హైకోర్టు తీర్పు
Telangana High Court
Follow us on

Telangana High Court on Gurukul TGT Posts: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థుల అర్హతపై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ అభ్యర్థులు అర్హులని తీర్పునిస్తూ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని.. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని సంబంధిత శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటిదాకా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్‌) (Telangana EDCET 2021) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం కల్పించింది. ఈ మేరకు జీవో 16 జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్‌), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌), బీబీఏ, బీటెక్‌ చేసిన వారు కూడా బీఎడ్‌ చదివే వీలు ఏర్పడింది. అయితే, ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఇక, బీఎడ్‌ ఫిజికల్‌ సైన్స్‌ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్‌–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్‌ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్‌లో చదివి ఉంటే సరిపోతుంది.

Read Also…  Akepati Amarnath Reddy: అన్నమయ్య మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ అమర్నాథ్‌రెడ్డి