Mahabubnagar: పీఠాలు కదిలాయంటే బహుశా ఇదేనేమో.. ఐదింట్లో మిగిలింది ఒక్కటే..!

| Edited By: Balaraju Goud

Mar 23, 2024 | 9:21 PM

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అయితే ప్రత్యర్థి బీఆర్ఎస్‌కు రోజుకో షాక్ తగులుతోంది. ఇతర పార్టీలకు స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు వలసలు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. ఏకంగా ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే బీఆర్ఎస్ కు మిగిలారు.

Mahabubnagar: పీఠాలు కదిలాయంటే బహుశా ఇదేనేమో.. ఐదింట్లో మిగిలింది ఒక్కటే..!
Zp Chairman
Follow us on

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అయితే ప్రత్యర్థి బీఆర్ఎస్‌కు రోజుకో షాక్ తగులుతోంది. ఇతర పార్టీలకు స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు వలసలు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. ఏకంగా ఐదుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లలో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే బీఆర్ఎస్ కు మిగిలారు.

పాలమూరు పాలిటిక్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే..! ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు, తర్వాత చూస్తే, పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలోని ఐదు జడ్పీ పీఠాలపై పాగా వేసిన బీఆర్ఎస్, ప్రస్తుతం ఒక్క స్థానానికి పడిపోయిది. ఉన్న ఆ ఒక్క స్థానంపైనా గ్యారెంటి సైతం లేకుండా ఉంది పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు నుంచే గులాబీకి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే సీటు కోసం పావులు కదిపి పార్టీ వీడారు జోగుళాంబ గద్వాల్ జిల్లా జడ్పీ ఛైర్మన్ సరితా తిరుపతయ్య. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగ ఓటమి పాలయ్యారు. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు నారాయణపేట జిల్లా జడ్పీ ఛైర్మన్ వనజా అంజనేయులు గౌడ్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వనపర్తి జిల్లా జడ్పీ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మాత్రం కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు.

నాడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న జడ్పీ పీఠాలను క్లీన్ స్వీప్ గా గెలిస్తే, అందులో ప్రస్తుతం ఒక్కరు మాత్రమే గులాబీ పార్టీలో ఉన్నారు. ఒక్క నాగర్ కర్నూల్ జడ్పీ పీఠం మాత్రమే గులాబీ ఖాతాలో ఉంది. అయితే తర్వలోనే ఆ స్థానాన్ని సైతం కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం మెజారీటీ జడ్పీటీసీల సంఖ్యా బలం కాంగ్రెస్ కే ఉంది. రేపో మాపో అవిశ్వాసానికి సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్క ఎన్నికలో వ్యతిరేక ఫలితం ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీని అతలాకుతలం చేస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార కాంగ్రెస్ అపరేషన్ ఆకర్ష్ ను ఏ మాత్రం తట్టుకోని నిలబడలేకపోతోంది బీఆర్ఎస్. వరుసగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వలసలు పార్టీ అధిష్టానం నేతలను మరింత ఆందోళన కల్పిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..