మొన్న విశాఖ.. ఇవాళ హైదరాబాద్.. డ్రగ్స్‌కు అడ్డాగా మారిన తెలుగు రాష్ట్రాలు
డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ న్యూస్. ఒకవైపు విశాఖ డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతున్నవేళ... మరోవైపు హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడటం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు తొమ్మిది కోట్ల రూపాయిల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్‌పోల్ సహాయంతో ఐడీఏ బొల్లారంలోని PSN మెడికేర్ కంపెనీలో సోదాలు చేశారు. నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ న్యూస్. ఒకవైపు విశాఖ డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతున్నవేళ… మరోవైపు హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడటం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు తొమ్మిది కోట్ల రూపాయిల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్‌పోల్ సహాయంతో ఐడీఏ బొల్లారంలోని PSN మెడికేర్ కంపెనీలో సోదాలు చేశారు. నిషేధిత డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 90 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. పదేళ్లుగా విదేశాలకు డ్రగ్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కస్తూరి రెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు బయటపడింది. హైదరాబాదులో కూడా ఈ డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు తీవ్ర దుమారం రేపుతున్న విశాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు సీబీఐ అధికారులు. కాకినాడ జిల్లా మూలపేటలోని సంధ్య ఆక్వా బ్రాంచ్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ పేరుతో ఆర్డర్లు రావడంతో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అటెన్షన్ ప్లీజ్ !! రైలు ఎక్కే ముందు ఈ ఒక్క పని చేయండి
చెరువులో నీళ్లు ఎండిపోయి అల్లాడిన చేపలు.. పండగచేసుకున్న స్థానికులు
ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్