BRS Khammam Public Meeting Updates: బీఆర్ఎస్ వస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్.. ఖమ్మం గుమ్మంలో కేసీఆర్ కీలక ప్రకటన..

|

Jan 18, 2023 | 6:03 PM

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. దేశం మొత్తాన్ని తెలంగాణ వైపు తిప్పేలా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం పూరించి..

BRS Khammam Public Meeting Updates: బీఆర్ఎస్ వస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్.. ఖమ్మం గుమ్మంలో కేసీఆర్ కీలక ప్రకటన..
Brs Khammam Meeting

జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. దేశం మొత్తాన్ని తెలంగాణ వైపు తిప్పేలా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం పూరించి.. తమ సత్తా ఏంటో చూపించబోతున్నారు సీఎం కేసీఆర్. ఈ సభకు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయ్ తో పాటు.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌ సీఎమ్‌లతో కలిసి యాదాద్రి చేరుకున్నారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jan 2023 05:52 PM (IST)

    బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే మళ్లీ జాతీయం..

    ఇక ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టడంపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారు వస్తే.. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జాతీయం చేస్తామని ప్రకటించారు. అలాగే కరెంట్‌ రంగానని కూడా పబ్లిక్‌ సెక్టార్‌లోనే ఉంచుతామన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలిస్తామని హామీ ఇచ్చారు… ప్రస్తుత బీజేపీ సర్కారుకు మంచినీళ్లు ఇవ్వడం కూడా చేతకవడం లేదన్న కేసీఆర్.. దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ అమలు చేసి చూపిస్తామన్నారు.. అలాగే సైన్యంలో ప్రవేశ పెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అమ్మేసినా బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే మళ్లీ జాతీయం చేస్తుందన్నారు కేసీఆర్.

  • 18 Jan 2023 05:50 PM (IST)

    75ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో విషపు మంచినీళ్లే.. – సీఎం కేసీఆర్

    75ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో ఇప్పటికీ చాలాచోట్ల విషపు మంచినీళ్లే ఉన్నాయన్నారు. దేశం లక్ష్యం కోల్పోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. నీళ్ల విషయంలో ట్రెబ్యునళ్ల ఏర్పాట్లపైనా కేసీఆర్ ఘాటుగా స్పందిచారు. ఉలుకూపలుకులేని ట్రెబ్యునళ్లతో ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు అని ప్రశ్నించారు. సాగుకు ఆమోదయోగ్యమైన భూమి ఉంది. నీరుంది. వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాడుకునే తెలివి కేంద్రంలోని ప్రభుత్వాలకు లేకపోయిందని విమర్శించారు కేసీఆర్.


  • 18 Jan 2023 05:48 PM (IST)

    బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..

    ప్రస్తుతం దేశమంతటా కరెంట్ కష్టాలు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. ఒక్క తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కోతలేనని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. 2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతాన్ని ఆవిష్కరిస్తామన్నారు. అలాగే రైతులకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు.  దేశవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం ఏటా 25 లక్షల మందికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు చేతకాకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

  • 18 Jan 2023 05:40 PM (IST)

    బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్.. – సీఎం కేసీఆర్

    బీజేపీది ప్రైవేటైజేషన్ విధానమైతే.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ విధానమన్నారు. ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని తిరిగి మళ్లీ జాతీయకరణ చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌.

  • 18 Jan 2023 05:40 PM (IST)

    బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ..! – కేసీఆర్

    1. 2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతం
    2. రైతులకు ఉచిత కరెంట్
    3. దేశవ్యాప్తంగా రైతుబంధు
    4. LICని జాతీయం చేస్తాం
    5. పబ్లిక్‌ సెక్టార్‌లోనే కరెంట్‌ రంగం
    6. ఏటా 25 లక్షల మందికి దళితబంధు
    7. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
    8. విశాఖ ఉక్కు జాతీయం
    9. దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ
    10. అగ్నిపథ్‌ను రద్దు
  • 18 Jan 2023 05:32 PM (IST)

    దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం – సీఎం కేసీఆర్‌

    దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందన్నారు. అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

  • 18 Jan 2023 05:27 PM (IST)

    ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు..

    ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.

  • 18 Jan 2023 05:19 PM (IST)

    ప్రపంచానికి ఫుడ్‌చైన్ అందించాం.. మనం మాత్రం మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం..

    దేశంలో అపార జల సంపద ఉంది.. భూమి ఉంది.. నీరు ఉంది. యాపిల్‌తోపాటు మామిడి కూడా పండుతుంది. మన దేశం ప్రపంచానికి ఫుడ్‌చైన్‌గా ఉండాలి. కానీ మనం మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నాం. ఫామ్‌అయిల్‌ను కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకింది. మన దేశం లక్ష్యాన్ని కోల్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • 18 Jan 2023 05:14 PM (IST)

    భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా..? – సీఎం కేసీఆర్

    బీఆర్ఎస్ జాతీయ పాలసీ, వైఖరి సమగ్రంగా వెల్లడిస్తాం. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా..? అంటూ ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తి మన దేశం సొత్తు.. కానీ ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండిపోయాం..? ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతం అని అన్నారు.

  • 18 Jan 2023 05:09 PM (IST)

    ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వరాలు..

    ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. ఖమ్మం జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 కోట్లు.. ఇతర మున్సిపాల్టీలకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నాం.

    లైవ్ ఇక్కడ చూడండి..

  • 18 Jan 2023 04:52 PM (IST)

    ఇక్కడ చాలా నేర్చుకున్నాం.. ఢిల్లీలో కూడా ఇదే చేస్తాం – ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌

    కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు.. కంటివెలుగు కార్యక్రమం నుంచే మేము చాలా నేర్చుకున్నామన్నారు ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌. ఢిల్లి వెళ్లాకా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. పంజాబ్‌లోనూ ఈ క్రమాన్ని చేపడతామని అన్నారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతంగా ఉన్నాయన్నారు.

  • 18 Jan 2023 04:40 PM (IST)

    పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పూలు ఉంటేనే బాగుంటుంది – పంజాబ్ సీఎం

    దేశమనే పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పూలు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ , కొందరు ఒకే రంగు పువ్వులను కోరుకుంటున్నారని విమర్శించారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. రాజు బికారి అవుతాడు, బికారి రాజు అవుతాడన్నారు.

  • 18 Jan 2023 04:36 PM (IST)

    ఇంతమంది జనాన్ని చూడాలంటే మాకు స్పెషల్ అద్దాలు కావాలి – పంజాబ్ సీఎం

    కేసీఆర్ కంటి వెలుగు అద్దాలిచ్చారని.. ఇంతమంది జనాన్ని చూడాలంటే మాకు స్పెషల్ అద్దాలు ఇవ్వాలని అన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.

  • 18 Jan 2023 04:26 PM (IST)

    సాగు, తాగునీటికి కొరత లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ..- డీ రాజా

    సాగు, తాగునీటికి కొరత లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మారిందన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా . దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్నారు. ఆర్ఎస్ఎస్. బీజేపీ.. దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయని విమర్శించారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారని ప్రశ్నించారు.

  • 18 Jan 2023 04:18 PM (IST)

    తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది – డీ రాజా

    తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా. రైతు బంధు, కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచేశారు.

  • 18 Jan 2023 04:13 PM (IST)

    ఇవాళ్టితో కేంద్రానికి ఇక 399 రోజులే ఉంది – అఖిలేశ్‌యాదవ్‌

    విపక్ష పార్టీల నేతలను కేసుల పేరుతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తోందన్నారు. నిన్న ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ప్రధాని మోదీ మాటలు విన్నాం. మోదీ ఇక 400 రోజులే మిగిలివుందంటున్నారు. అంటే కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటోందన్నారు. ఇవాళ్టితో కేంద్రానికి ఇక 399 రోజులే ఉందన్నాన్నారు.

  • 18 Jan 2023 04:05 PM (IST)

    విమర్శించే నాయకులపై ఢిల్లీ ప్రభుత్వం దాడి చేస్తోంది- అఖిలేశ్‌యాదవ్‌

    ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు.. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌. విమర్శించే నాయకులపై ఢిల్లీ ప్రభుత్వం దాడి చేస్తోందని విమర్శించారు.

  • 18 Jan 2023 04:00 PM (IST)

    హిందీని బలవంతంగా రుద్దుతున్నారు – కేరళ సీఎం

    హిందీని బలవంతంగా రుద్దుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. ప్రాంతీయ భాషలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారు. సుప్రీం కోర్టును కూడా నేరుగా కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారు.
    ఇలాంటి కష్టసమయంలో రాజ్యాంగాన్ని సుప్రీం కాపాడాలి. ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడారు. దేశంలో పేదరికం పెరిగింది.. సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉంది. మోదీ పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయి. కేరళలో మతతత్వ శక్తుల కుట్రలు తిప్పికొడుతున్నాం. తెలంగాణలో కూడా అదే జరగాలని అన్నారు.

  • 18 Jan 2023 03:57 PM (IST)

    వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్ అంటూ నేరుగా ఫెడరలిజంపై దాడి – కేరళ సీఎం

    అసెంబ్లీలను బలహీనం చేసేలా బిల్లుల్ని తొక్కిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేరళ సీఎం పినరయి విజయన్‌. వన్‌ నేషన్‌- వన్ ట్యాక్స్.. వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్ అంటూ నేరుగా ఫెడరలిజంపై దాడి చేస్తున్నారని విమర్శించారు.

  • 18 Jan 2023 03:54 PM (IST)

    ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన – కేరళ సీఎం

    ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతుందని విమర్శించారు కేరళ సీఎం పినరయి విజయన్‌. మోదీ కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. మోదీ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి..
    విదేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా కేంద్రం పెత్తనం చేస్తోంది. కీలక విషయాల్లో రాష్ట్రాలను సంప్రదించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయని విమర్శించారు. అసెంబ్లీలను బలహీనం చేసేలా బిల్లుల్ని తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.

  • 18 Jan 2023 03:52 PM (IST)

    పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు-కేరళ సీఎం

    తెలంగాణ సాయుధ పోరాటంతో రాచరికాన్ని తరిమికొట్టారని గుర్తు చేశారు కేరళ సీఎం పినరయి విజయన్‌. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

  • 18 Jan 2023 03:42 PM (IST)

    కేసీఆర్ పోారాటానికి మా మద్దతు ఉంటుంది.. – కేరళ సీఎం పినరయి విజయన్

    కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమం. సంక్షేమ పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు పెనుముప్పు పొంచి ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన పోరాటానికి మా మద్దతు ఉంటుందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. ఈ సభ దేశానికి ఓ దిక్సూచీ లాంటిదన్నారు.

  • 18 Jan 2023 03:33 PM (IST)

    సభా ప్రాంగణంకు చేరుకున్న సీఎం కేసీఆర్..

    తెలంగాణ ప్రగతి రథంలో బీఆర్ఎస్ సభా ప్రాంగణంకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చేరుకున్నారు. ఆయనతోపాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరితోపాటు ఇతర పార్టీల జాతీయ నాయకులు కూడా వెంట వచ్చారు.

  • 18 Jan 2023 02:36 PM (IST)

    జాతీయ నేతల చేతుల మీదుగా బాధితులకు కళ్లజోళ్లు..

    అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం ఖమ్మంలో ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ నేతల చేతుల మీదుగా బాధితులకు కళ్లజోళ్లు అందించారు.

  • 18 Jan 2023 02:19 PM (IST)

    కంటి వెలుగు ప్రారంభం అనంతరం..

    కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్.. మంత్రులను, ఎంపీలను సీఎంలకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

  • 18 Jan 2023 02:15 PM (IST)

    రెండో విడత కంటి వెలుగును ప్రారంభించిన సీఎం కేసీఆర్

    ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు రాష్ట్రాల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్.. మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ నేత డి రాజా పాల్గొన్నారు.

  • 18 Jan 2023 01:50 PM (IST)

    ఖమ్మం కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌..

    ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మం బహిరంగ సభకు చేరుకోనున్నారు.

  • 18 Jan 2023 01:12 PM (IST)

    కేసీర్ ఖమ్మం టూర్ లైవ్ అప్డేట్స్..

  • 18 Jan 2023 12:25 PM (IST)

    లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎంలు..

    ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.

  • 18 Jan 2023 12:14 PM (IST)

    ఖమ్మం ఇలా చేరుకోనున్నారు..

    * 11.30కి యాదాద్రి నుంచి ఖమ్మం వస్తారు.

    * 12 గంటలకి ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ప్రారంభోత్సవం.

    * 12.20కి రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం.

    * 1 గంటకి కలెక్టరేట్‌లో లంచ్ చేస్తారు.

    * 2.30కి సభా వేదికపైకి నలుగురు సీఎంలు చేరుకుంటారు.

Follow us on