National Integration Day: ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సర్కార్

|

Sep 17, 2023 | 11:03 AM

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది కూడా కార్యక్రమమాలను ఘనంగా నిర్వహించనునుంది బీఆర్ఎస్ సర్కార్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజున జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు సీఎం. అలాగే మరోవైపు జిల్లా కేంద్రాల్లో కూడా జాతీయ సమైక్యత దినోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

National Integration Day: ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సర్కార్
Chief Minister Kcr
Follow us on

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విలీన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది కూడా కార్యక్రమమాలను ఘనంగా నిర్వహించనునుంది బీఆర్ఎస్ సర్కార్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజున జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు సీఎం. అలాగే మరోవైపు జిల్లా కేంద్రాల్లో కూడా జాతీయ సమైక్యత దినోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ప్రభుత్వ విప్, చీఫ్ విఫ్‌లు అలాగే మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్‌రావు, మెదక్‌లో తలసాని శ్రీనివాస్ యూదవ్ సహా పలువురు మంత్రులు తమ జిల్లాలో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అయితే ఏయే జిల్లాల్లో ఎవరెవరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలనే సమాచారాన్ని మొత్తం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి వెల్లడించారు. ఇదిలా ఉండగా.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు సీఎం కేసీఆర్. గత ఏడాది కూడా తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర సర్కార్ ఘనంగా నిర్వహించింది. మూడు రోజుల పాటు ర్యాలీలు నిర్వహించడంతో సహా.. వాడవాడలా జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ ఏడాది సైతం పెద్దఎత్తున వేడుకలు జరుపేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసారు బీఆర్ఎస్ శ్రేణులు.

జెండా ఎగరవేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
మరోవైపు తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..