BRS: ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్.. తెలంగాణలో హ్యాట్రిక్‌ కొడతామని ధీమా..

| Edited By: Janardhan Veluru

Apr 25, 2023 | 10:03 PM

మళ్లీ అధికారంలోకి వస్తాం..! హ్యాట్రిక్ కొడుతాం.! తెలంగాణ వ్యాప్తంగా BRS నిర్వహించిన మినీ ప్లీనరీల్లో నేతలంతా ఇదే మాట చెప్పారు.! ఎన్నికల శంఖారావం పూరించిన నేతలు.. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు .

BRS: ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్.. తెలంగాణలో హ్యాట్రిక్‌ కొడతామని ధీమా..
KCR
Follow us on

ఏప్రిల్‌ 27న బీఆర్ఎస్‌ పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం. దీనికి సన్నాహంగా రాష్ట్రవ్యాప్తంగా…తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించారు. బీఆర్ఎస్‌ పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైనా చర్చించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పార్టీ జెండాలను ఎగరేశారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావడం చారిత్రక అవసరం అన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్‌తో మహారాష్ట్రలో మొదలైన విప్లవం దేశమంతా విస్తరిస్తుందని చెప్పారు. గజ్వేల్ ప్రతినిధుల సభలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థ ద్వారా కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు..

ఇదిలావుంటే. బీఆర్ఎస్ ప్లీనరల్లో కొన్నిచోట్ల విభేదాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా వైరాలో పార్టీ శ్రేణులు రెండుగా విడిపోయాయి. ప్రతినిదుల సభకు హాజరు కాకుండా..తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి. నాగార్జున సాగర్‌ మీటింగ్‌కు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గం దూరంగా ఉంది. కొడంగల్‌ సభకు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, అతని అనుచరులు గైర్హాజరయ్యారు.

నాగార్జున సాగర్‌ బీఆర్ఎస్‌లోనూ గ్రూప్‌ వార్‌ నడుస్తోంది. హలియాలో జరిగిన మీటింగ్‌కు ఎమ్మెల్యే నోముల భగత్ హాజరయ్యారు. అయితే ఈ ప్లీనరీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వర్గం దూరంగా ఉంది. భగత్, కోటిరెడ్డి మధ్య కొంతకాలంగా గ్యాప్‌ నెలకొంది..

వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్‌లోనూ విభేదాలు వెలుగుచూశాయి.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా ఉంది సీన్‌. కొడంగల్‌లో బీఆర్ఎస్‌ ప్లీనరీలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, అతని అనుచరులు దూరంగా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం