Menstrual Leave: నెలసరి సెలవులపై వివాదం.. మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారన్న ఎమ్మెల్సీ కవిత

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Menstrual Leave: నెలసరి సెలవులపై వివాదం.. మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారన్న ఎమ్మెల్సీ కవిత
Kavitha Smriti Irani

Updated on: Dec 15, 2023 | 12:37 PM

మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఒక మహిళగా ఆమె అలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇటీవల రాజ్యసభలో నెలసరి కోసం సెలవు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత సోషల్ మీడియా ట్విటర్ X వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహిళల అనుభవాల పట్ల సానుభూతి లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కవిత ఇలా ట్వీట్ చేశారు. ‘‘నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించింది. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు మహిళగా బాధపడుతున్నా. నెలసరి మనకున్న ఎంపిక కాదు. అదొక సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లే’’ అంటూ కవిత ట్విటర్ ఎక్స్‌ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

జీవసంబంధమైన వాస్తవికతను గుర్తించి, మహిళల శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే విధానాలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇదిలావుంటే గతంలో అయోధ్య ఆలయంపై కూడా స్పందించారు. అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్యలో గర్భగుడి ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన క్రమంలో కవిత ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్‌కు జత చేశారు. ఈ శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నారని తెలిపారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…