
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్ది.. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. అటు ప్రతిపక్షాలు రోజుకో కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడ తగ్గేదే లే అంటూ ముందుకు
వేళుతుంది. దీనిలో భాగంగానే నిజామాబాద్ జిల్లా బోదన్ ఎమ్మెల్సి కవిత. పాదయాత్ర ఇప్పుడు హట్ టాఫిక్ గా మారింది. బోదన్ పట్టణంలో ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత చీఫ్ గెస్టుగా పాల్గోన్నారు. కవిత బోదన్ చేరుకోగానే గులాభి శ్రేణులు భారి స్వాగతం పలికారు. ఆచన్ పల్లి చౌరస్తా నుండి సభ నిర్వహిస్తున్న షుగర్ ప్యాక్టరి గ్రౌండ్ వరకు ఎమ్మెల్సి కవిత చేపట్టిన పాదయాత్ర ఆసక్తిగా మారింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు ఎమ్మెల్సీ కవిత.. దారిపోడువున ఉన్న వాళ్లకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. స్థానికులు కూడ పాదయాత్రలో పాల్గొన్నారు.
నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతోన్నాయి. పాదయాత్రలూ ఊపందుకుంటోన్నాయి. ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పాదయాత్రకు దిగారు. బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సమావేశానికి పాదయాత్రగా వెళ్లారు. కవితకు ఎమ్మెల్యే షకీల్ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. సభలో పాల్గొన్న కవిత ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధించారు. ప్రత్యేకించి- కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కవిత. రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.
‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లింది’ అని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ‘భారత్ జోడీ యాత్ర’ను ఆయన పోల్చారు. భోదన్‌లో జరిగిన పార్టీ సమావేశానికి కవిత హాజరయ్యారు. 62 ఏళ్లు దేశాన్ని పాలించి ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చినా పేదలు పేదలుగానే మిగిలిపోయారని కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత కె.కవిత ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మిగితా పార్టీలకు ప్రజలకు ఈవీఎం లాగా కనపడుతారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, బోధన్ లో సీనియారిటీ కి సిన్సియారిటీకి మధ్యే పోటీ అన్నారు.
The spirit of Telangana and the celebration of “Car and KCR Sarkar”! ✊🏻
This Padyatra today reflects on the tremendous energy and enthusiasm towards BRS Government led by CM KCR Garu.
Jai Telangana!
Jai KCR! pic.twitter.com/5dVkm3NaSJ— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 16, 2023
కేసీఆర్ హయాంలో గత పదేళ్లలో రాష్ట్రంలో మత హింస జరగలేదన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని, అయితే తెలంగాణకు శక్తివంతమైన నాయకుడు, శక్తిమంతమైన ప్రజాస్వామ్యం ఉందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజ్యాంగం వర్ధిల్లుతుందనేది సత్యమని రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా చేరిందని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం