MLC Kavitha: ఈడీ అరెస్ట్‌ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంలో కవిత భర్త పిటిషన్ 

|

Mar 17, 2024 | 7:46 PM

లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడిగింది. వాటికి ఆమె ఏం సమాధానం ఇచ్చారు. ఫస్ట్‌ డే విచారణలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ? కొశ్చనింగ్‌ టైమ్‌లో కాక పుట్టించే ప్రశ్నలు వేశారా? వివరాలు తెలుసుకుందాం పదండి...

MLC Kavitha: ఈడీ అరెస్ట్‌ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంలో కవిత భర్త పిటిషన్ 
MLC Kavitha
Follow us on
ఓవైపు  ఎంక్వయిరీ ఫ్రేమ్‌లో ఎమ్మెల్సీ కవిత .. మరోవైపు  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు  నోటీసులు.. రాజకీయ ప్రకంపనలు రేపిన  లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ  మరింతగా పిడిబిగించేస్తోంది.  హైదరాబాద్‌లో  కవితను అరెస్ట్‌ చేసి  ఢిల్లీకి తరలించడం.. కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ  సీబీఐ కోర్టు  ఆదేశించడం చకచకా జరిగాయి. ఇక విచారణలో భాగంగా తొలిరోజు ఢిల్లీ ఈడీ సెంట్రల్‌ ఆఫీసులో  కవితను ప్రశ్నించారు. మరోవైపు సుప్రీంలో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె భర్త  సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు.
 ఢిల్లీ ఈడీ సెంట్రల్‌ ఆఫీసులో  కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది.  ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ భాను ప్రియ మీనా ఆధ్వర్యంలో రెండు బృందాలుగా  కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. పిళ్ళై, బుచ్చి బాబు, అభిషేక్, మాగుంట రాఘవ.. మాగుంట శ్రీనివాసులు , శరత్ చంద్ర స్టేట్‌మెంట్‌ల ఆధారంగా కవితను  ప్రశ్నించినట్టు  సమాచారం.
 మరోవైపు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లిన  కవిత భర్త  అనిల్‌, కేటీఆర్‌, హరీష్‌రావు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే కవిత దాఖలు చేసిన సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఈడీ అధికారులు ..కవితను అరెస్ట్‌ చేయడం నిబంధనలను విరుద్దమని  కేటీఆర్‌ ఇప్పటికే ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. కవిత అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ  ఆమె భర్త అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. కవిత తరుపున  సీనియర్‌ లాయర్లు  కపిల్‌ సిబాల్‌, రోహిత్గీ వాదనలు విన్పిస్తారని  సమాచారం.
తొలి రోజు ఈడీ  విచారణ ముగిసింది. ఎంక్వయిరీ తరువాత  కవితను కలవడానికి కుటుంబసభ్యులకు  అనుమతినిచ్చారు . భర్త అనిల్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు ఈడీ సెంట్రల్‌ ఆఫీసులో కవితను కలిసి మాట్లాడారు.  ఇక  రెండో రోజు  సోమవారం  రెండు కీలక  అంశాలు..  కవిత అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ .. రెండోది  విజయ్‌నాయర్‌, పిళ్లై.. కవిత ముగ్గుర్ని  కలిపి  ఎంక్వయిరీ చేసే అవకాశం . కవితతో మాట్లాడేందుకు అతికొద్ది మందికే మాత్రమే ఈడీ పర్మిషన్‌ ఇచ్చింది. కుటుంబసభ్యులతో పాటు కవిత న్యాయవాదులు మోహిత్‌ రావు, వజీ షఫీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు ఈడీ అధికారులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి