MLA Rohith Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించే అడిగారు.. ఈడీ అధికారుల తీరుపై రోహిత్‌ రెడ్డి ఫైర్..

|

Dec 21, 2022 | 6:45 AM

ఈడీ ఇంటరాగేషన్‌పై సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేశారు పైలట్‌ రోహిత్‌రెడ్డి. అయ్యప్ప దీక్షలో ఉన్న తనని ఇబ్బంది పెట్టారంటూ ఫైరయ్యారు. ఇంతకీ ఈడీ ఏం అడిగింది? రోహిత్‌రెడ్డి ఏం చెప్పారు?

MLA Rohith Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించే అడిగారు.. ఈడీ అధికారుల తీరుపై రోహిత్‌ రెడ్డి ఫైర్..
Mla Rohith Reddy
Follow us on

తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండోరోజు 8గంటలపాటు ప్రశ్నించింది. మంగళవారం మధ్యాహ్నం మొదలైన సెకండ్‌డే ఇంటరాగేషన్‌.. రాత్రి 11గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనే ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. వివిధ కోణాల్లో అనేక ప్రశ్నలు అడిగినట్టు చెప్పుకొచ్చారు రోహిత్‌రెడ్డి. మళ్లీ ఈనెల 27న హాజరుకావాలని చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల తీరుపై మండిపడ్డారు MLA రోహిత్‌రెడ్డి. అయ్యప్ప దీక్షలో ఉన్న తనని రెండ్రోజులపాటు ఇబ్బంది పెట్టారంటూ ఫైరయ్యారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి తప్ప ఏమీ అడగలేదన్నారు. ఈ కేసులో తానే ఫిర్యాదుదారుడినైతే నన్నే ప్రశ్నించడమేంటో అర్ధం కావడం లేదన్నారు. అయితే, బీజేపీ కుట్రను తానెలా బయటపెట్టానో ఈడీ అధికారులను వివరించినట్లు చెప్పుకొచ్చారు. తనతోపాటు కుటుంబ సభ్యుల ఇన్ఫర్మేషన్‌, ఆస్తుల వివరాలు కూడా అడిగినట్టు వెల్లడించారు. టోటల్‌గా ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని పైలట్‌ రోహిత్‌రెడ్డి వెల్లడించారు.

మళ్లీ ఈ నెల 27న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు కోణాల్లో వివరాలు సేకరించిన ఈడీ.. వాటిని పరిగణలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..