కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారు అతి వేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే లాస్య మృతి చెందగా, ఆమె డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అయితే ఇటీవల ఆమె బీఆర్ఎస్ నల్లగొండ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో సభ నుంచి ఇంటికి తిరుగు వెళ్తుండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఆ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డు చనిపోయాడు. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోవడం ప్రతిఒక్కరిని కలచివేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో BRS నేతలు షాక్‌కి గురయ్యారు. కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి డెడ్‌బాడీని చిక్కడపల్లిలోని నివాసానికి తీసుకెళ్లనున్నారు. గత ఏడాది ఇదే నెలలో ఆమె తండ్రి సాయన్న చనిపోయారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే, ఆయన కూతురు 2024 ఫిబ్రవరి 23న చిన్న వయసులో చనిపోవడం కుటుంబల్లో తీవ్ర విషాదం నింపింది.
MLA లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం, పదిరోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురికావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న డివైడర్ ను ఢీకొట్టడంతో చనిపోవడం.. ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడటం కంటతడి పెట్టించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి