తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ జరిగింది. విద్యుత్ అప్పులపై అసెంబ్లీ అధికార విపక్షాల మధ్య పెద్ద వార్ జరిగింది. ఈ క్రమంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగంలో జరిగిన స్కామ్‌లపై అవసరమైతే న్యాయవిచారణ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో దేనికైనా సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసిరింది. ఆ తర్వాత చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిన హరీష్ రావు.. మైక్ కట్ చేయవద్ంటూ స్పీకర్ ను కోరారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్ట్ సిటీ ప్రజల మీద సీఎం అక్కసు వెళ్లగక్కుతున్నారంటూ పేర్కొన్నారు. సిద్దిపేటలో, గజ్వేల్, ఓల్ట్ సిటీలో కాంగ్రెస్ గెలవలేదనే బాధలో సీఎం రేవంత్ ఉన్నారని.. దీంతోనే కరెంట్ బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదంటూ మాట్లాడారన్నారు. ఇది వాస్తవం కాదంటూ హరీష్ రావు వివరించారు. అక్కడ ఏదన్న ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో, ఒక ఇండస్ట్రీయలిస్ట్ ఎవరన్న కట్టకపోతే, ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప.. నియోజకవర్గ ప్రజలను అవమానించవద్దంటూ హరీష్ రావు కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని.. దాంట్లో తప్పేముందని హరీష్ రావు ప్రశ్నించారు. తాము పార్టీలు మారలేదంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..