Telangana Politics: తెలంగాణలో హీటెక్కిన “పవర్” పాలిటిక్స్.. ఉచిత విద్యుత్తుపై నేతల మధ్య పేలుతున్న మాటల తూటలు..

| Edited By: Sanjay Kasula

Jul 14, 2023 | 12:34 PM

BRS Vs Congress: పీసీసీ చీఫ్ రేవంత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వ్యవసాయంలో రేవంత్ రెడ్డికి ఏబిసిడిలు కూడా తెలియని ఆయన విమర్శించారు.

Telangana Politics: తెలంగాణలో హీటెక్కిన పవర్ పాలిటిక్స్.. ఉచిత విద్యుత్తుపై నేతల మధ్య పేలుతున్న మాటల తూటలు..
TPCC President Revanth Reddy
Follow us on

పవర్ పాలిటిక్స్ రాష్ట్రాన్ని వేడెక్కిస్తోంది. ఉచిత విద్యుత్తు అంశం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చివరికి వ్యక్తిగత దూషణ వరకు కూడా వెళుతుంది. ఉచిత విద్యుత్ పై పీసీసీ చీఫ్ రేవంత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వ్యవసాయంలో రేవంత్ రెడ్డికి ఏబిసిడిలు కూడా తెలియని ఆయన విమర్శించారు. మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హౌలా నెంబర్ వన్ అని, వ్యవసాయం పేరుతో బావుల దగ్గరికి పోయేది సురా పానకం కోసమేనని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. బషీర్ బాగ్ విద్యుత్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటున్న రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం… అసలు అప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నడో తెలియదని అన్నారు.

ఎన్ఎల్ డీసీ నుండే విద్యుత్ కొనుగోలు జరుగుతుందని, ఇందులో అవినీతి జరిగిందని రేవంత్ అనడం ఆయన అవివేకానికి నిదర్శమని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్ పై అసత్య ప్రచారం మానుకోవాలని కోరారు. తొమ్మిదేళ్లలో ఎకరం పంట ఎక్కడైనా ఎండిందని, సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయా…? అని ప్రశ్నించారు. కరెంటు నిరంతరాయంగా వస్తున్నందునే అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు.

ఇదిలావుంటే, ఫ్రీ కరెంట్‌ కామెంట్స్‌పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్‌రెడ్డి. అమెరికా నుంచి వచ్చీరాగానే వివరణ ఇచ్చుకున్నారు. ఊర్లో పెళ్లికి కుక్కల సందడిలాగా పుట్టలో పడుకున్న పాములన్నీ బయటికొచ్చి రాద్ధాంతం చేస్తున్నాయంటూ BRSపై నిప్పులు చెరిగారు. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించి బిట్లు బిట్లుగా తన మాటల్ని ఎడిట్‌ చేశారని ఆరోపించారు రేవంత్‌. ఫ్రీ కరెంట్‌ పేరుతో జరుగుతోన్న దోపిడీనే బయటపెట్టానన్నారు రేవంత్‌. ఉచిత కరెంట్‌కు ఏటా 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, అందులో 8వేలకోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని నిలదీశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం