BRS Party: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ నజర్.. రంగంలోకి దిగిన కేటీఆర్.. ఇక వరుసగా సమావేశాలు..

|

Jan 03, 2024 | 1:42 PM

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్‌.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమీక్షలో పాల్గొనేందుకు పార్టీ ముఖ్యనేతలు తెలంగాణ భవన్‌ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి జరగనున్న ఈ సమావేశాలు.. ఈ నెల 21 వరకు కొనసాగుతాయి.

BRS Party: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ నజర్.. రంగంలోకి దిగిన కేటీఆర్.. ఇక వరుసగా సమావేశాలు..
KTR
Follow us on

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్‌.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమీక్షలో పాల్గొనేందుకు పార్టీ ముఖ్యనేతలు తెలంగాణ భవన్‌ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి జరగనున్న ఈ సమావేశాలు.. ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. మొదటి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు నిర్వహిస్తారు. జనవరి 3న ఆదిలాబాద్‌, 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి స్థానాలపై సమీక్ష ఉంటుంది. చిన్న బ్రేక్‌ తర్వాత 16 నుంచి మీటింగ్‌లు నిర్వహిస్తారు. నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలు రెండో విడదలతో సమీక్షిస్తారు.

సంక్రాంతి పండుగ సమయంలో ఈ సమావేశాలకు మూడురోజుల విరామం ప్రకటించారు. తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగుతాయి. ఇవాళ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశం జరుగుతోంది. ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఈ సమావేశాలకు ఆయా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.

ఇప్పటికే చేవేళ్ల నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ నాయకత్వం. ఈ విషయాన్ని రంజిత్ రెడ్డి వెల్లడించారు. దీంతో మిగతా స్థానాల్లో అభ్యర్థులుగా ఎవరిని బరిలోకి దింపుతారు ? సిట్టింగ్ ఎంపీల్లో ఎంతమందికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశాల్లో వాటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..