KCR: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

|

Dec 08, 2024 | 7:04 PM

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం.. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని అందరికీ వివరించాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (కే చంద్రశేఖర్ రావు) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.. ప్రజాసమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.

KCR: తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం.. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Kcr
Follow us on

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం.. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని అందరికీ వివరించాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (కే చంద్రశేఖర్ రావు) బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.. ప్రజాసమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు.. ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో BRS LP సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సోమవారం (డిసెంబర్ 09) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించడంతోపాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. నిర్బంధ పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని.. అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కేసీఆర్ సూచించారు. రైతుబంధు ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తామని.. కాంగ్రెస్ సర్కార్ వైఖరి ఎండగడతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి తర్వాత బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తామని.. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్‌ పవర్‌ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదిక, ఫోన్‌ట్యాపింగ్ లాంటి అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టాలనే విషయంలో బీఆర్‌ఎస్‌ సభ్యులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్..

తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల్లో, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనేదానిపై…బీఆర్‌ఎస్‌ సభ్యులకు కేసీఆర్‌ మార్గదర్శనం చేశారని మాజీ మంత్రి హరీష్‌ రావు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..