KCR: త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్‌.. అక్కడ ఎవరెవర్ని కలుస్తారు..?

ఇప్పటికే, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వాటిని వడపోసి, ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి అందించింది. అందరి అభిప్రాయాలు తీసుకుని కొన్ని పేర్లు షార్ట్‌ లిస్ట్‌ చేయడమూ జరిగింది. వీటితో పాటు వేరే పార్టీల్లో బలంగా ఉన్న నేతలను కూడా తీసుకోవాలనుకుంటోంది.

KCR: త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్‌.. అక్కడ ఎవరెవర్ని కలుస్తారు..?
KCR

Updated on: Feb 19, 2024 | 6:52 PM

తెలంగాణ పాలిటిక్స్‌లో బ్రేకింగ్ న్యూస్ ఇది. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళుతున్నారు కేసీఆర్‌. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, BRS పొత్తుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారన్న దానిపై ఉత్కంఠ నడస్తోంది. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల కోసం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ నేత పార్టీని వీడారు. అయినా సరే.. కార్‌ ఓవర్‌లోడ్‌ అయింది కాబట్టి వెళ్లే వాళ్లను ఆపబోం అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది బీఆర్ఎస్. వచ్చే లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు చాలా ప్రెస్టేజియస్. కచ్చితంగా గెలవాలి, నిలవాలి. అందుకే, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనుకుంటోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇందుకోసం కొత్తవాళ్లకి టికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదా.. సీనియర్లకు లోక్‌సభ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా ఆలోచిస్తోంది.

తుంటి ఆపరేషన్‌ తరువాత కేసీఆర్ కూడా లైన్‌లోకి వచ్చేశారు. నల్లగొండ సభ సూపర్‌ సక్సెస్‌ అయిందనే ఉత్సాహంతో ఉంది ఆ పార్టీ. ఓవైపు కేటీఆర్, హరీష్‌రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్న వేళ, అసెంబ్లీలో ఈ ఇద్దరూ ప్రభుత్వానికి ధీటుగా సమాధానాలు చెబుతున్న వేళ.. కేసీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బాపు అంటూ కేసీఆర్‌ను ఫోకస్‌ చేస్తున్నారంటూ ఓ ఉదాహరణ చూపిస్తున్నారు. మొన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ బాపు అనే స్లోగన్‌ ఒకటి హైలెట్ అయింది.

ఈ ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవాలంటే మెజారిటీ లోక్‌సభ సీట్లలో గెలవడం బీఆర్ఎస్‌కు చాలా ముఖ్యం. రేపు జాతీయ పార్టీ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా.. అంతా నెంబర్‌ గేమ్‌లోనే ఉంటుంది. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు కేసీఆర్. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 7 పార్లమెంట్‌ సెగ్మెంట్లలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ఆధిక్యత కనిపించింది. అంటే, ఆ ఏడు పార్లమెంట్‌ స్థానాలపై గట్టిగా ఫోకస్‌ పెడితే కచ్చితంగా గెలవొచ్చనే భావనలో ఉందీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న నినాదం ఈ రెండు పార్టీలను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఏకంగా పొత్తు వరకు టాపిక్‌ వెళ్లిపోయింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ చాలా బలంగా చెబుతోంది. కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్.. వీళ్లంతా పొత్తు ఉండబోదని క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఆకస్మాత్తుగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన సమాచారంతో మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..