KCR: అందరికీ ఇదే నా రిక్వెస్ట్.. ఆసుపత్రి నుంచి భావోద్వేగంతో వీడియోను విడుదల చేసిన కేసీఆర్..

|

Dec 12, 2023 | 8:31 PM

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిప్ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ అనంతరం ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేసీఆర్ ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్‌లో జారిపడ్డారు. దీంతో తుంటి ఎముకకు గాయమైంది. సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చేర్చగా.. వైద్యులు ఆయనకు హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు.

KCR: అందరికీ ఇదే నా రిక్వెస్ట్.. ఆసుపత్రి నుంచి భావోద్వేగంతో వీడియోను విడుదల చేసిన కేసీఆర్..
KCR
Follow us on

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిప్ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ అనంతరం ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేసీఆర్ ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్‌లో జారిపడ్డారు. దీంతో తుంటి ఎముకకు గాయమైంది. సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చేర్చగా.. వైద్యులు ఆయనకు హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. దీంతో కేసీఆర్ ను రాజకీయాలకు అతీతంగా నాయకులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలందరూ ఆయన్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యశోదా ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు.

తనను పరామర్శించేందుకు రావొద్దని కేసీఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనతో పాటు హాస్పిటల్‌లో ఉన్న మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే కోలుకుని అందరి మధ్యకు వస్తానని.. అప్పుడు అందరూ కలవచ్చంటూ తెలిపారు. అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు గద్గద స్వరంతో చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్. తనను చూడడానికి వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని.. అదే జరిగితే డిశ్చార్జ్ మరింత ఆలస్యం అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. అందుకే వద్దంటూ వీడియోలో పేర్కొన్నారు కేసీఆర్. తన కోసం వేచి చూస్తున్న వారంతా ఇళ్లకు వెళ్లాలంటూ కేసీఆర్ భావోద్వేగంతో తెలిపారు. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని.. పార్టీ శ్రేణులు, అభిమానులు సహకరించాలంటూ కేసీఆర్ కోరారు.

వీడియో చూడండి..

ఆస్పత్రికి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానుల తాకిడి ఎక్కువ కావడం.. ఆస్పత్రి వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్‌ ఓ వీడియో రిలీజ్ చేశారు. అభిమానులెవరూ ఆస్పత్రి రావొద్దని విజ్ఞప్తి చేశారు కేసీఆర్‌. వీఐపీల రాకతో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వందలాది మంది పేషెంట్లు, వాళ్ల కుటుంబసభ్యులు ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి వీడియో రిలీజ్ చేశారు కేసీఆర్‌. సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటున్న కేసీఆర్.. డాక్టర్ల పర్యవేక్షణలో వాకర్ సాయంతో నడుస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..