Brothers die with coronavirus, దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా కుటుంబాలకు కుటుంబాలే ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ కోవిడ్ మహమ్మారి నిత్యం వేలాది మందిని బలి తీసుకుంటోంది. తాజాగా కరోనా కారణంగా ఇద్దరు అన్నదమ్ములు ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా, నాగల్‌గిద్ద మండలం, గోప్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. గోప్యానాయక్ తండాకు చెందిన 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు అన్నదమ్ములు జ్వరంగా అనిపించడంతో ఈ నెల 12న స్థానికంగా కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. మరుసటి రెండు రోజుల్లోనే జ్వరం తగ్గకపోవడంతో నారాయణఖేడ్‌లోని ప్రాంతీయ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు ఇద్దరికీ పాజిటివ్ అని నిర్థారణ అయింది.
పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు ఇద్దరిని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిద్దరూ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అన్నదమ్ములిద్దరూ పనులకు వెళుతూ కటుంబాలను పోషిస్తున్నారు. వీరి మృతితో కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతోపాటు తండాలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో తండా వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Also Read: