Ambedkar Photo: కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వినోద్ కుమార్

|

Jul 30, 2021 | 8:57 PM

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Ambedkar Photo: కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వినోద్ కుమార్
Ambedkars Photo
Follow us on

BR Ambedkar Photo on Currency Note: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలను ఆయన సూచించారు. కరెన్సీ నోటుపై అంబేద్కర్‌‌ ఫొటో ముద్రించాలని కోరుతూ పల్లె నుంచి ఢిల్లీ దాకా తమ బాణీ వినిపిస్తామన్నారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కమిటీ ప్రతినిధులు కోరారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలన్న అంబేద్కర్ ఫొటో సాధన సమితి కమిటీ ప్రతినిధుల డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని వినోద్‌ కుమార్‌ అన్నారు. కమిటీ తలపెట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్‌ను బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో లేకుండా కరెన్సీ నోటు ఉండటం చరిత్రను వక్రీకరించడమేనని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం అన్నారు.

మరోవైపు, ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలకు అంబేద్కర్ ఫొటో సాధన సమితి వినతి పత్రం అందజేశారు. కరెన్సీ నోటుపై అంబేద్కర్‌‌ ఫొటో ముద్రించాలని కోరుతూ పల్లె నుంచి ఢిల్లీ దాకా నిర్వహిస్తున్న ప్రజాచైతన్య యాత్రను జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని జనగామ నుంచి దేశవ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.

Br Ambedkar Photo On Currency Note

‘‘1949లో ఆర్బీఐని జాతీయం చేయాలన్న ఆలోచన అంబేద్కర్​ది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం తీసుకువచ్చింది అంబేద్కర్. అంతటి మహనీయుని ఫోటో లేకుండా ఆర్బీఐ కరెన్సీ నోటు ముద్రించడం దౌర్భాగ్యం” అని కమిటీ కమిటీ సభ్యులు అన్నారు. పార్లమెంటులో చట్టం తీసుకువచ్చి కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించేలా ఎంపీలు చొరవ చూపాలన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2021 ఏప్రిల్ 14లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Read Also… 

గీత కార్మికులను చూసిన చమ్మగిల్లిన మాజీ ఐపీఎస్.. ఈత చెట్టు ఎక్కి ఈతి బాధలు తెలుసుకున్న ప్రవీణ్‌కుమార్.. చిత్రాలు