Hyderabad Crime: రాజేంద్ర నగర్‌లో మిస్టరీగా బాలుడు మిస్సింగ్ కేసు.. ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు..

|

Oct 22, 2021 | 5:27 AM

Hyderabad Crime: రాజేంద్రనగర్‌లో బాలుడు కిడ్నాప్‌ మిస్టరీగా మారింది. బాలుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక పోలీస్‌ టీమ్స్‌ పని చేస్తున్నాయి.

Hyderabad Crime: రాజేంద్ర నగర్‌లో మిస్టరీగా బాలుడు మిస్సింగ్ కేసు.. ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు..
Boy Missing
Follow us on

Hyderabad Crime: రాజేంద్రనగర్‌లో బాలుడు కిడ్నాప్‌ మిస్టరీగా మారింది. బాలుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక పోలీస్‌ టీమ్స్‌ పని చేస్తున్నాయి. అనుమానితులందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. చిన్న క్లూ దొరికినా చాలు అనుకుని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో డాగ్‌ స్క్వాడ్‌తో గాలిస్తున్నారు. కాలనీల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గత 10 నెలల నుంచి రాజేంద్ర నగర్‌లోని కొండల్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటుంన్నారు అపర్ణ, శివశంకర్‌ దంపతులు. వారికి ఉన్న సొంత ఇళ్లు నిర్మాణం జరుగుతుండడంతో మరో ఇంటిలో ఉంటున్నారు. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న శివశంకర్‌.. రోజూలాగే ఆఫీస్‌కు వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు పిల్లలు రోడ్డు మీదకు వచ్చారు. కొంత సమయం తర్వాత పెద్దబ్బాయి లక్కీ ఇంటికి వెళ్లాడు. కానీ.. చిన్న పిల్లాడు ఎంతకు పైకి రాక పోవడంతో అనుమానం వచ్చిన తల్లి.. చుట్టుపక్కల గాలించిది. అయినా ఎలాంటి అచూకీ దరొక పోవడంతో విషయాన్ని భర్తకు చెప్పింది. వెంటనే ఇద్దరు వెళ్లి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. బాధితుడి ఫ్లాట్‌ని పరిశీలించారు. సీసీ కెమారాలు సైతం చాలా రోజుల నుంచి పని చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్‌ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదు. అపార్ట్‌మెంట్‌ సీసీ కెమెరాల వైర్లను తొలగించినట్టు గుర్తించారు. చిన్నారి అనీష్‌ కోసం.. మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ఆచూకి మాత్రం లభించలేదు. అయితే.. ఈ కేసుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా తెలిసిన వారే కిడ్నాప్‌ చేశారా? లేక ఏవైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ప్రతి రోజు చెత్తకు వచ్చే వాళ్లు.. గురువారం మాత్రం మధ్యాహ్నం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో చెత్త తీసుకెళ్లేవారు ఏమైనా బాబుని కిడ్నాప్ చేశారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా చిన్నారి ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also read:

Forest Office: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌లో భారీ దోపిడీ.. లక్షలు విలువచేసే వస్తువులు మాయం.. అది వారి పనేనా..?

Viral News: ఆన్‌లైన్‌లో చిప్స్‌ ఆర్డర్‌ చేశాడు.. ప్యాక్ తెరిచి చూస్తే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..!

Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్.. కారణం ఏంటంటే..