Green India Challenge: పర్యావరణ పరిరక్షణకోసం నేను అంటోన్న బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్..

|

Aug 23, 2022 | 4:37 PM

ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకోవడం తమ వంతుగా బాధ్యతగా భావిస్తున్నారు. మొక్కలు నాటుతూ.. మరో ముగ్గురుకి ఛాలెంజ్ ను విసురుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగేలా చేస్తున్నారు. తాజాగా బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని  మొక్కలు నాటారు. 

Green India Challenge: పర్యావరణ పరిరక్షణకోసం నేను అంటోన్న బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్..
Nikhat Zareen
Follow us on

Green India Challenge: తెలంగాణ లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలను పెంచండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్‌కుమార్ (MP Santosh Kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఏళ్లుగా ఈ కార్యక్రమంలో సినీ నటీనటులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు భాగమవుతూ..  సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకోవడం తమ వంతుగా బాధ్యతగా భావిస్తున్నారు. మొక్కలు నాటుతూ.. మరో ముగ్గురుకి ఛాలెంజ్ ను విసురుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగేలా చేస్తున్నారు. తాజాగా బాక్సింగ్ దిగ్గజం నిఖత్ జరీన్ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని  మొక్కలు నాటారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ ను వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్వీకరించారు. మంగళవారం రోజున జూబ్లీహిల్స్  జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. అంతేకాదు తాను నాటిన మొక్కల వద్ద సంతోషముగా సెల్ఫీ తీసుకున్నారు.

ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టడం గొప్ప నిర్ణయమని అన్నారు. మనకు మంచి ఆక్సిజన్ వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని జరీన్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..