Suryapet: అర్ధరాత్రి పాడుబడిన ఇంటి నుంచి వింత శబ్దాలు..ఏంటా అని వెళ్లి చూడగా..

కుక్కలు, పిల్లుల వల్ల శబ్దాలు వస్తున్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ చాలాసేపు ఆ వింత శబ్ధాలు కంటిన్యూ కావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అంత రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి చూసేందుకు ఎవరూ సాహసించలేదు. పొద్దున్నే అందరూ కలిసి వెళ్లి చూడగా.....

Suryapet: అర్ధరాత్రి పాడుబడిన ఇంటి నుంచి  వింత శబ్దాలు..ఏంటా అని వెళ్లి చూడగా..
Black Magic

Updated on: May 29, 2024 | 5:12 PM

రాత్రి వేళ బాగా పొద్దుపోయింది. సమయం మిడ్ నైట్ 12. ఊర్లో జనం అంతా మంచి డీప్ స్లీప్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఊరు చివరన ఉన్న పాడుబడ్డ ఇంటి నుంచి ఏవో విచిత్రమైన శబ్ధాలు వస్తున్నాయి. కుక్కలు, పిల్లలు లోపలికి వెళ్లాయేమో అనుకున్నారు. కానీ ఆ శబ్ధాలే చాలాసేపు కంటిన్యూ అయ్యాయి. దీంతో గ్రామస్థుల్లో కంగారు మొదలైంది. ఎవరైనా ధైర్యవంతులు కూడబలుక్కుని ఆ ఇంటి వద్దకు వెళ్లమని చాలామంది సూచించారు. కానీ ఎవరూ సాహసించలేదు. పొద్దు పొడవగానే.. ధైర్యం చేసి కొందరు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. లోపల కనిపించింది చూసి నిర్ఘాంతపోయారు.

ఇంట్లో ఓ మూలకు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, అరటి పండ్లు,  తాయత్తులు, అగరబత్తులు కనిపించాయి. తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కూడా గ్రామస్థులు గుర్తించారు.  గుప్తనిధుల కోసం ఎవరో క్షుద్రపూజలుగా నిర్ధారణకు వచ్చి.. గ్రామ పెద్దలు పోలీసులకు సమచారమిచ్చారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో గతరాత్రి ఈ క్షుద్రపూజలు కలకలం చెలరేగింది. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో కొందరు క్షుద్ర పూజలు చేశారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావటంతో గ్రామస్థులు హడలిపోయారు. ఆ ఇంటి యజమాని పద్మ అనే మహిళ ఈ పూజలు చేయించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆంధ్రాలోని నరసరావుపేట నుంచి మాంత్రికులను తీసుకొచ్చి పూజలు చేయించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఇలాంటి వాళ్లపై నిఘా పెడతామని.. ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదని పోలీసులు చెబుతన్నారు. అంధ విశ్వాసాలతో ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే.. తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంత అప్‌డేటెడ్ సొసైటీలో కూడా ఇంకా ఇలాంటి వాటిని నమ్మేవారు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..