Telangana BJP: హుజురాబాద్‌లో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర.. ఈటెల డుమ్మా..!

| Edited By: Balaraju Goud

Mar 03, 2024 | 12:37 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా హిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే మొదటి డత పూర్తి చేసిన బండి, రెండవ డత మొదలు పెట్టారు. షెడ్యూల్ కంటే ముందుగానే కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం పర్యటించే విధంగా ప్లాన్ చేసుకున్నారు.

Telangana BJP: హుజురాబాద్‌లో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర.. ఈటెల డుమ్మా..!
Bandi Sanjay Etela Rajender
Follow us on

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా హిత యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే మొదటి డత పూర్తి చేసిన బండి, రెండవ డత మొదలు పెట్టారు. షెడ్యూల్ కంటే ముందుగానే కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం పర్యటించే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగుతుంది. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం కనబడలేదు. ఆయన అనుచరులు కూడా ఈ యాత్రకు దూరంగానే ఉంటున్నారు. సంజయ్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు…

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. కమలాపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. తరువాత నియోజకవర్గంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. కరీంనగర్ పార్లమెంటు చేసిన అభివృద్ధి పనులను వరిస్తున్నారు బండి సంజయ్. ముఖ్యంగా స్థానిక నేతలు, కార్యకర్తలకు కూడా జోష్ నింపుతున్నారు. వారికి ఎక్కవ సమయాన్ని కేటాయిస్తున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు.. యాత్రకు ఇంచార్జీగా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పటికే వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలు పూర్తయ్యాయి. ఈ మూడు నియోజకవర్గాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు యాత్రతో పాల్గొన్నారు. కానీ, హుజురాబాద్ నియోజవకర్గం వచ్చేసరికి.. ఈటెల రాజేందర్ కనబడలేదు. ఆయన ఎక్కడ కూడా యాత్రకు హాజరుకాలేదు.

అయితే, ఈటెల సోదురుడు భద్రయ్య మాత్రం బండి సంజయ్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో సంజయ్ కొద్ది సేపు ఈటెల ఇంట్లో గడిపారు. అయితే.. ఈ యాత్రకు ఈటెల హాజరుకావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఈసారి కరీంనగర్ లోక్ సభ స్థానం మంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు సంజయ్ ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే ప్రజాహిత యాత్రతో జనంతో మమేకమవుతున్నారు. కానీ కొంత మంది నేతలు కలిసి రాకపోవడంతో మరోసారి బీజేపీ విబేధాలపై చర్చ మొదలైంది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. ఇక్కడ బీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. అప్పుడు ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు.. ఇక్కడ ఈటెల బీజేపీలో ఉన్నప్పటికీ, వారి ఇద్దరి మధ్య గ్యాస్ కారణంగా మళ్లీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా అన్న చర్చకు తెరలేచింది. చూడాలి మరీ ఎన్నికల నాటి విబేధాలు సర్ధుమణిగి కలిసిపోతారో లేదో..!!

మురోవైపు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. దీంతో పార్లమెట్ ఎన్నికల్లో కూడా త్రిముఖ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రెండవ స్థానానికి పరిమితమయ్యారు. సంజయ్. గత ఎన్నికల్లో మెజారిటీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. 2019 ఎన్నికల్లో హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి లీడ్ రాలేదు. అయితే, ఇప్పుడు అనుకూలత ఉన్న ముఖ్య నేతలు కలిసి రాకపోవడంతో క్యాడర్ ఆయోమయానికి గురువుతున్నారు. అయితే ఈటెలకు సమాచారం ఉందా లేదనే షయం మాత్రం తెలియడం లేదు. ఈ ఇద్దరి నేతలు మాత్రం ఇప్పటికీ కలిసి పని చేయడం లేదన్నదీ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.

మరోవైపు నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం పార్టీ కార్యక్రమాలపై ప్రభావం పడుతుంది. అయితే బండి సంజయ్ మాత్రం అందరికి సమాచారం ఇచ్చానని.. ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పటికైనా కలిసి పని చేస్తారా.. లేదా అన్నదీ వేచి చూడాలి..!!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…