Bandi Sanjay Birthday: బండి సంజయ్.. చుట్టూ కార్యకర్తలు.. ఆత్మీయులు.. అభిమానులు.. యువత.. బండి సంజయ్ ఎక్కడుంటే అక్కడే వీరంతా అక్కడే. ఆయన చుట్టూ సెక్యూరిటీ కంటే వీరే ఆయనకు బలం. మొన్నటి వరకు తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ప్రతినిత్యం కార్యకర్తలతో సమయం గడుపుతూ ఉండేవారు. పుట్టినరోజు.. పెళ్లిరోజు.. అని తేడా లేకుండా కుటుంబం కన్నా ఎక్కువగా పార్టీ కార్యకర్తలతో గడిపే బండి సంజయ్.. ఈసారి తన పుట్టినరోజుకు మాత్రం కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. మంగళవారం జూలై 11.. బండి సంజయ్ పుట్టినరోజు.. ప్రతి ఏటా బండి సంజయ్ పుట్టినరోజును కరీంనగర్‌లో కార్యకర్తలతో గడపడం ఆయనకు ఇష్టం.
అదే రోజు హైదరాబాదులో కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పుట్టినరోజు వేడుకలు అన్ని పార్టీ కార్యకర్తలతో జరుపుకుంటారు బండి సంజయ్. ఎంపీ అవ్వకముందు అయిన తర్వాత కూడా కరీంనగర్ కార్యకర్తలతో వేడుకలు జరుపుకున్న బండి సంజయ్.. పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కరీంనగర్ కార్యకర్తలతోపాటు హైదరాబాదులోని పార్టీ కార్యకర్తలతో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.
కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం.. కొత్త అధ్యక్షుడు నియామకం జరగడంతో అటు బండిలోను, బండి అనుచరులలోను కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి సమయంలో కార్యకర్తల మధ్య ఉంటే వారు బాధపడతారనే ఉద్దేశంతో సంజయ్.. తన పుట్టినరోజు వేడుకలను ఈసారి కార్యకర్తలతో కాకుండా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు సోమవారం రాత్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి వెళ్లారు.
జన్మదిన సందర్భంగా వారణాసి వెళ్తున్నట్టు విశ్వనాధుని దర్శనం చేసుకుంటున్నారు. అందుబాటులో లేకపోవడానికి చింతిస్తున్నట్టుగా కూడా అభిమానులకు సందేశం ఇచ్చారు బండి సంజయ్.. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు అంతా కూడా బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం