Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణ కమలదళానికి కొత్త కోచ్.. కొత్త బాస్‌తో టీం సెట్ అయ్యేనా..?

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కొత్త కోచ్ వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండా పోటీలో దిగిన కాషాయ దళానికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమించారు. బీజేపీ కొత్త కోచ్ ముందున్న సవాళ్లు ఎంటి ?

Telangana BJP:  తెలంగాణ కమలదళానికి కొత్త కోచ్.. కొత్త బాస్‌తో టీం సెట్ అయ్యేనా..?
Chandrashekar
Follow us
Sridhar Prasad

| Edited By: Balaraju Goud

Updated on: Jan 16, 2024 | 4:57 PM

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కొత్త కోచ్ వచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండా పోటీలో దిగిన కాషాయ దళానికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమించారు. బీజేపీ కొత్త కోచ్ ముందున్న సవాళ్లు ఎంటి ? తెలంగాణ కమలనాథులను ఆయన ఏకం చేయగలరా ? అన్నదీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

తెలంగాణకు సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమించింది బీజేపీ అధిష్టానం. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టును ఎట్టకేలకు బీజేపీ హైకమాండ్ ఫిలప్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత కార్యదర్శి లేకపోతే ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సంస్థాగత కార్యదర్శిగా బి.ఎల్.సంతోష్ ఎంత పవర్ ఫుల్లో.. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి అంతే పవర్ ఫుల్. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తెరవెనక కీలకంగా పనిచేసిన చంద్ర శేఖర్‌ను తెలంగాణ బాధ్యతలు అప్పగించారు.

రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి గా చంద్రశేఖర్ సక్సెస్ ఫుల్ అయ్యారు. వసుంధర రాజే లాంటి రాటు తేలిన నేతలను పార్టీలో సైలెంట్ చేసిన చంద్రశేఖర్‌ను తెలంగాణ బాధ్యతలు అప్పగించడంలో ఏదో ఆంతర్యం లేకపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన చంద్రశేఖర్ రాజకీయ నిర్ణయాల్లో కఠినంగా వ్యవహరిస్తారని టాక్. గతంలో మంత్రి శ్రీనివాస్ తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంజయ్ కుమార్‌కు మంత్రి శ్రీనివాస్ పొసగలేదు. దీంతో మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్, హర్యానా సంస్థాగత కార్యదర్శిగా బదిలీ చేశారు. అప్పటి నుంచి కోచ్ లేకుండా తెలంగాణ బీజేపీ టీమ్ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసింది.

గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాలతో పార్టీలో రచ్చ కొనసాగుతోంది. నేతల మధ్య సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమస్యను అధిగమించి అత్యధిక పార్లమెంట్ సీట్లను సాధించడం కోచ్ ముందున్న పెద్ద సవాల్. తెలంగాణ బీజేపీ కొత్త కోచ్.. టీమ్ ను ఏ విధంగా ముందుకు నడుపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్ర శేఖర్ తెలంగాణ బీజేపీని గాడిలో పెడతారా? బదిలీ పై మళ్ళీ వెళ్ళిపోతారా ? అన్నది వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…