BJP Ramchander Rao : పట్టబద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం ఆపార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీ విజయం కానేకాదని బీజేపీ నేతలు రామచందర్ రావు, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. మీకు పీఆర్సీ ఇస్తాం లేదంటే మీకు దుర్భరమైన జీవితాన్ని ఇస్తామంటూ గులాబీ పార్టీ నేతలు బెదరింపులకు పాల్పడ్డారని బీజేపీ నేతలు విమర్శించారు. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజల విజయమని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. మీ ఆశీస్సులతో మరింత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మీ పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు హామీ ఇచ్చారు.