Telangana: కంచె తీసేసినంత మాత్రాన స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు.. తెలంగాణ మరో వెనిజులా అవుతుందిః పాయల్ శంకర్

|

Dec 08, 2024 | 2:05 PM

అప్పులు చేయడం తప్పు కాదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తేల్చి చెప్పారు. అయితే కమీషన్ల కోసం అప్పులు చేయడం సరికాదన్నారు.

Telangana: కంచె తీసేసినంత మాత్రాన స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు.. తెలంగాణ మరో వెనిజులా అవుతుందిః పాయల్ శంకర్
Payal Shanker
Follow us on

టీవీ9 కాంక్లేవ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఏడాది పాలనలో ఫెయిలయ్యామని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారన్నారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలేంటి.. ఇప్పుడు సీఎంగా చేస్తున్నదేంటి అని విమర్శించారు. కాంగ్రెస్‌ విజయోత్సవాలు దేనికోసమని ప్రశ్నించారు పాయల్ శంకర్. కంచె తీసేసినంత మాత్రాన స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదన్నారు. కాంగ్రెస్ ఏడాదిలో లక్ష కోట్ల రూపాయిలు అప్పు చేశారని, ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో వెనిజులా అవుతుందన్నారు. అప్పులు చేయడం తప్పు కాదన్న పాయల్ శంకర్.. అయితే కమీషన్ల కోసం అప్పులు చేయడం సరికాదన్నారు. సరైన ప్రాతిపదికన అప్పులు చేయాలన్నదే తమ విధానమన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. వేల కోట్లు ఖర్చు చేసి ప్రధాని మోదీ దేశం రూపురేఖలే మార్చేశారని పాయల్ శంకర్ గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..