MLA Etela Rajender: ఈటల రాజేందర్ సస్పెండ్ తర్వాత ఉద్రిక్తత.. అసెంబ్లీ నుంచి బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి..
బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఈటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను ఈటల తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీస్ వాహనంలో..
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వెళ్లాలంటూ స్పీకర్ పోచారం ఆదేశించడంతో.. సభ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఈటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను ఈటల తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీస్ వాహనంలో ఎక్కేందుకు ప్రయత్నించారు.
ఈ చర్యలను ఈటల వ్యతిరేకించగా.. బలవంతంగా ఆయనను పోలీస్ వాహనంలో ఎక్కించి తరలించారు. తన సొంత వాహనంలో బయటకు వెళతానని బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. శాసనసభ నుంచి ఈటల రాజేందర్‌ను పోలీసులు శామీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి తరలించారు.
గద్దె దించే వరకు విశ్రమించను..- ఎమ్మెల్యే ఈటల రాజేందర్
మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఏడాదిగా కుట్ర చేస్తున్నారని.. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. గొంతు నొక్కుతున్నారు.. గద్దె దించే వరకు విశ్రమించను.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడనంటూ ప్రభుత్వంపై విమవర్శలు గుప్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం