Etela Rajender: మాజీ నక్సలైట్లతో కలిసి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.. ఇలా చేయడం మొదటిసారి కాదన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పైనుంచి ఆదేశాలు అని చెప్తున్నారు. మేము ప్రజలను, ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళం. మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారట.

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి పథకం ప్రకారమే దాడి జరిగిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అర్వింద్ తల్లి విజయలక్ష్మిని ఆయన పరామర్శించారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇది ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం.. ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తోందని అన్నారు. పోలీసుల పహారాలో రాజ్యం నడుపుతున్నారు. నైరాశ్యంతో సహనం కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాళ్ళకింద భూమి కదిలిపోయి గెలవలేమని దాడులు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎంపీ ఇంటిమీద పోలీసుల పర్యవేక్షణలో ఈ దాడి జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దాడులను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు ఈటల రాజేందర్.
అయితే ఇలా దాడి చేయడం వారికి ఇది మొదటిది కాదన్నారు. బండి సంజయ్ పాదయాత్రలో కూడా ఇలాంటి దాడులు జరిగాయన్నారు. మునుగోడు ఎన్నికల్లో భయ బ్రాంతులు సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డి కూడా మీద దాడి చేశారు. మా అత్త గారి ఊర్లో నా భార్యతో, గ్రామ మహిళలతో ఉండగా నా మీద దాడి చేశారు. ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు, నర్సంపేట ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్ రెడ్డి దాడికి దిగారు. కర్రలకు మేకులు కొట్టుకొని వచ్చారు. బస్తాల్లో రాళ్ళు నింపుకొని వచ్చి మా రక్తం కళ్ళజూసారు. ఈ దాడులపై కేంద్ర మంత్రి అమిత్ షా ఉత్తరం రాశామన్నారు.
ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు కాపాడడంలో ప్రజలకు రక్షణకల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.మాకు రక్షణ లేకుండా పోయింది.అసెంబ్లీ కి రానివడ్డం లేదు.చట్టం చెల్లదు నేనే చండశాసనుడిని అన్నట్లుగా కెసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈటల రాజేందర్.
“సీఎం కెసీఆర్ స్వయంగా ఎల్పీ మీటింగ్ లో బీజేపీ వారిమీద దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్పారంటే ఏం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఒక మహిళ అయి ఉండి కూడా కొట్టి కొట్టి చంపుతామని మాట్లాడుతారు. ఎటు పోతున్నాం.. మనమిచ్చిన అధికారంతో మన మీదనే దాడులు చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. కేంద్రానికి నివేదిస్తాం.. రాష్ట్రం విఫలం అయినప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
“ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పైనుంచి ఆదేశాలు అని చెప్తున్నారు. మేము ప్రజలను, ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళం. మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారట. అమిత్ షాకి ఆ నివేదిక కూడా పంపుతాం” కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. హిట్లర్ , ముస్సొలి అనుకుంటున్నారు. వారికి పట్టినగతే ఈయనకు పడుతుందని అన్నారు. అలాంటి పిచ్చి వేషాలకు ఈ దేశంలో అవకాశం లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం