Etela Rajender: కేసీఆర్ భూమ్మీదకు రావాల్సి ఉంది.. బీసీలు, ఎస్సీలు అంటే బీఆర్ఎస్ నేతలకు చులకనగా ఉందన్న ఈటల రాజేందర్

| Edited By: Shaik Madar Saheb

Jun 28, 2023 | 7:32 AM

Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోవడంపైనా తనదైన శైలిలో చెప్పారు.. అణగారిన ప్రజలను కౌశిక్ రెడ్డి చులకనగా చూస్తున్నారు. అణగారిన ప్రజలను బూతులు తిడుతూ కొడుతున్నారు. హుజురాబాద్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ముఖ్యమంత్రి జాగీరా..? ప్రగతిభవన్‌ నీ జాగీరా కేసీఆర్‌ అంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్..

Etela Rajender: కేసీఆర్ భూమ్మీదకు రావాల్సి ఉంది.. బీసీలు, ఎస్సీలు అంటే బీఆర్ఎస్ నేతలకు చులకనగా ఉందన్న ఈటల రాజేందర్
Etela Rajender Press Meet
Follow us on

హైదరాబాద్, జూన్ 27: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకోసం 20కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు ఈటల. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోవడంపైనా తనదైన శైలిలో చెప్పారు.. అణగారిన ప్రజలను కౌశిక్ రెడ్డి చులకనగా చూస్తున్నారు. అణగారిన ప్రజలను బూతులు తిడుతూ కొడుతున్నారు. హుజురాబాద్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ముఖ్యమంత్రి జాగీరా..? ప్రగతిభవన్‌ నీ జాగీరా కేసీఆర్‌ అంటూ ప్రశ్నించారు. గత మూడు ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ లేదంటే బీజేపీ గెలిచిందన్నారు ఈటల రాజేందర్. కాంగ్రెస్‌ ఏ ఎన్నికల్లో గెలవలేదన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదన్నారు. పదవుల కంటే విలువలు ముఖ్యమన్నారు ఈటల రాజేందర్.

ధరణి వచ్చాక పేదల భూములు మాయమయ్యాయని.. దేవాలయాలు, వక్ఫ్ భూములు కేసీఆర్ ఖాతాల్లోకి వెళాయన్నారు ఈటల రాజేందర్. ధరణి భూస్వాములకు మేలు చేసింది. ధరణి వచ్చాక పేదల భూములు మాయమయ్యాయి. దేవాలయాలు, వక్ఫ్ భూములు కేసీఆర్ ఖాతాల్లోకి వెళ్లాయి. ధరణి భూస్వాములకు మేలు చేసింది. ఇతర నేతలతో ఫోటో దిగితే పథకాలు ఆపేస్తారని ప్రజలు భయపడుతున్నారు ఈటల రాజేందర్.

కేసీఆర్ మరోసారి గెలిస్తే రాష్ట్రంలో నిరంకుశత్వం మరింత పెరుగుతుందన్నారు ఈటల రాజేందర్.. తెలంగాణలో గెలిచేంది బీజేపీ మాత్రమే అని అన్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. కేసీఆర్ భూమ్మీదకు రావల్సిన ఉందన్నారు. ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. బీసీలు, ఎస్సీలు అంటే బీఆర్ఎస్ నేతలకు చులకన భావం ఉంది. క్షమాపణలు చెప్పాల్సింది ఆయనకు కేసీఆర్ చెప్పాల డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షేమాపణలు చెప్పేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు ఈటల రాజేందర్.

ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ వీడియో కోసం ఇక్కడ చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం