Bandi Sanjay: వేదిక మారినా.. రూట్‌లో చిన్న మార్పులు.. తగ్గని కమలనాథుల్లో జోష్.. మంగళవారం సభకు భారీ ఏర్పాట్లు..

|

Nov 28, 2022 | 9:13 PM

పోలీసులు నో పర్మిషన్ అన్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభా వేదిక మారినా... రూట్‌ మ్యాప్‌లో చిన్న మార్పులు చోటుచేసుకున్నా కమలనాథుల్లో జోష్ మాత్రం తగ్గలేదు. ఇంతకీ రేపటి సభను ఎక్కడ ఏర్పాటు చేస్తారు? చీఫ్‌గెస్ట్‌గా ఎవరొస్తారు?

Bandi Sanjay: వేదిక మారినా.. రూట్‌లో చిన్న మార్పులు.. తగ్గని కమలనాథుల్లో జోష్.. మంగళవారం సభకు భారీ ఏర్పాట్లు..
Bandi Sanjay Kumar
Follow us on

ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కరీంనగర్‌ నుంచి నిర్మల్‌కు వెళ్లిన బండి సంజయ్.. అడెల్లి పోచమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సారంగపూర్‌ వరకు 3 కిలోమీటర్లమేర పాదయాత్ర
చేశారు. రాత్రి గుండెగాంలో బస చేశారు. పాదయాత్రకు షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు. భైంసా వెళ్లకూడదని, సభను కూడా భైంసా టౌన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పింది. 500 మందితో పాదయాత్ర, 3 వేల మందితో సభ జరుపుకోవాలి ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే మీటింగ్‌ పెట్టుకోవాలని సూచించింది. ఇతర మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని .. అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు స్పష్టంచేసింది.

హైకోర్టు సూచనల మేరకు సభాస్థలిని మార్చింది బీజేపీ.! మొదటి షెడ్యూల్ ప్రకారం భైంసా బైపాస్‌ రోడ్డు దగ్గర సభకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వేదిక భైంసాకు 2. 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే 5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్థలాన్ని ఎంపిక చేశారు.

బండి సంజయ్‌ తీరుపై మండిపడింది TRS. పాదయాత్రను ప్రజలను రెచ్చగొట్టే కుట్రయాత్రగా అభివర్ణించింది. మొత్తానికి ఐదో విడత యాత్రకు ముందే ఓ రేంజ్‌లో టెన్షన్‌ క్రియేట్ అయింది. రేపటి సభతో హీట్‌ పీక్‌స్టేజ్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం