రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..

రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను పంపగా.. రాజాసింగ్‌ రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు.

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..
Raja Singh

Updated on: Jul 11, 2025 | 2:38 PM

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజాసింగ్. మరోవైపు, బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని గతంలోనే రాజాసింగ్‌ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌‌లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా రాజాసింగ్‌ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీనిపై రాజాసింగ్ స్పందించాల్సి ఉంది. అలాగే ఆయన భవిష్యత్తు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు ఎమ్మెల్యే పదవిపై కూడా ఆయన స్పందించాల్సి ఉంది.