పొలిటికల్ పార్టీలలో బీజేపీ స్టైలే వేరు. ఎన్నికలు ఎక్కడైనా.. రాష్ట్రం ఏదైనా.. బీజేపీ ప్లాన్ మాత్రం పక్కాగా ఉంటుంది.. ఒక్కసారి టార్గెట్ సెలెక్ట్ చేసుకుందంటే తగ్గేదే ఉండదు.. ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేస్తూ ఊహించని వ్యూహాలతో దూసుకుపోవుడే కమలదళం స్టైల్.. అయితే, ఇదంతా ఉత్తరాదిలోనే.. దక్షిణాదిలో మాత్రం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోతోంది బీజేపీ. అందుకే, ఏదిఏమైనాసరే.. దక్షిణాదిలోనూ దంచికొట్టాలని డిసైడైంది కాషాయ పార్టీ. అందుకోసం సరికొత్తగా పావులు కదుపుతూ నయా వ్యూహరచన చేస్తోంది.
దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించింది. ఈ కీలక మీటింగ్‌కి సౌతిండియా బీజేపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మెయిన్ లీడర్స్ అటెండ్ అయ్యారు.
దక్షిణాదిలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. హైదరాబాద్ మీటింగ్ అజెండా ఇదే.. ఈ సింగిల్ పాయింట్ అజెండాతోనే సమావేశం జరిగింది. పార్టీని ఎలా బలోపేతం చేయాలి? అధికారం దక్కించుకోవడానికి ఏం చేయాలి? అనే అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. మెయిన్‌గా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది.
పార్టీ పరంగా దేశం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించిన బీజేపీ.. ఆయా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మీటింగ్ సదరన్ జోన్‌కి సంబధించింది. సౌత్‌లోనే ఐదు రాష్ట్రాలతో పాటు ముంబై.. లక్షద్వీప్, పాండిచ్చేరి, గోవా నేతలు కూడా పాల్గొన్నారు.
టార్గెట్ 170… ఇదీ ఎజెండా. దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 170 పార్లమెంట్ సీట్లు రావాలన్నది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ ఉత్తరాదిన సీట్లు తగ్గినా.. ఆ లోటును దక్షిణాదితో తీర్చుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. దీనికోసం ఎటువంటి యాక్షన్ ప్లాన్ రాసుకోవాలి.. ఏం చేస్తే పార్టీలో పునరుత్తేజం వస్తుంది.. కర్నాటక చేదు అనుభవం నుంచి క్యాడర్‌ని ఎలా బైటపడెయ్యాలి.. అనే అంశం ఈ భేటీలో చర్చకొచ్చింది.
ఈ భేటీ ఎంత పకడ్బందీగా జరిగిందంటే.. మీటింగ్‌తో సంబంధం లేని నాయకుల్ని గాని, మీడియాను గానీ పరిసరాల్లోకే రానివ్వలేదు. ఇది చాలా రహస్య సమావేశం అంటూ మైకుల ముందు మాట్లాడకుండానే వెళ్లిపోయారు నేతలు. ఇదే మొదటిది కాదు.. ఇదే చివరిది కాదంటోంది బీజేపీ. ఇటువంటి రీజినల్ మీటింగ్స్ ఎన్నికల వరకూ తరచూ జరుగుతూనే ఉంటాయని, తద్వారా సౌత్‌లో పార్టీ చొచ్చుకు వెళ్లేలా చేయాలని ప్లాన్ చేస్తోంది.
హైదరాబాద్‌లో పార్టీ సమావేశానికి వచ్చిన నడ్డా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తరువాత నోవాటెల్ హోటల్‌లో తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలతో నడ్డా సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, సమన్వయంతో పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు నడ్డా.
కాగా, దక్షిణాదిలో కమలం దూకుడుకి కన్నడ ఫలితాలు బ్రేక్ వేశాయి. కర్నాటక ఓటర్ల వార్నింగ్‌తో అలర్టైన బీజేపీ.. రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది. ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చేసి పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు తెలంగాణ నుంచి బండి సంజయ్‌ని, ఏపీ నుంచి సోము వీర్రాజును బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. ఇప్పుడు, దక్షిణాది రాష్ట్రాల కీలక సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం ఆసక్తి రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..