నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం చేటు చేసుకుంది. ఓ ఫంక్షన్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత పలకరించుకున్నారు. ఎమ్మెల్యే గణేష్‌తోపాటు బీఆర్ఎస్ నేతలను బండి సంజయ్‌కి పరిచయం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య గృహప్రవేశంలో సీన్ కనిపించింది. పొలిటికల్‌గా ఉప్పు నిప్పులా ఉండే ఈ ఇద్దరు నేతలు ఇలా ఫంక్షన్‌లో ఎదురుపడడం.. ఒకరికొకరు అభివాదం చేసుకుంటూ పలకరించుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఒకరు ఫంక్షన్‌కు వచ్చి వెళ్తుండగా.. మరొకరు అప్పుడే వచ్చారు. వీరిద్దరు ఎంట్రెన్స్ గేట్‌లో ఎదురుపడ్డారు. దీంతో ఒకరిని ఒకరు ముందుగా అభివాదం చేసుకున్నారు. తమ వెంట వచ్చిన నేతలను పరిచయం చేసుకున్నారు. ఇలా ఇద్దరు నేతలు కలవడంతో అక్కడ ఓ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇద్దరు నేతలు నవ్వుతూ పలకరించుకోవడంతో రెండు పార్టీల నేతలు సంబర పడిపోయారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్య తన గృహప్రవేశానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. దీనికి తోడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు ఎవరు పిలిచినా వెళ్లే పరిస్థితి నెలకొంది. ఎవరు ఆహ్వానించిన తప్పుకుండా హాజరువతున్నారు. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం