Munugode by Poll: మునుగోడు ఎన్నికల ఫలితాలపై రాజ్‌ గోపాల్‌ రెడ్డి ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమన్నారంటే..

తెలంగాణ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల ఆధిపత్యం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోకి రాగా తర్వాత వరుసగా రెండు రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చేసింది. దీంతో ఫలితాలు...

Munugode by Poll: మునుగోడు ఎన్నికల ఫలితాలపై రాజ్‌ గోపాల్‌ రెడ్డి ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమన్నారంటే..
Raj Gopal Reddy

Updated on: Nov 06, 2022 | 10:46 AM

తెలంగాణ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల ఆధిపత్యం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోకి రాగా తర్వాత వరుసగా రెండు రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చేసింది. దీంతో ఫలితాలు క్షణక్షణానికి మారుతూ వస్తున్నాయి. అయితే అనూహ్యంగా నాలుగో రౌండ్‌ వచ్చేసరికి టీఆర్‌ఎస్‌ మళ్లీ పుంజుకుంది. అర్బన్‌ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం చూపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే హోరాహోరీగా సాగుతోన్న ఎన్నికల కౌంటింగ్‌పై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి స్పందించారు. కౌంటింగ్‌ ప్రారంభమైన సమయం నుంచి కేంద్రం వద్దే ఉన్న రాజ్‌ గోపాల్‌ రెడ్డి నాలుగో రౌండ్ తర్వాత కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్న మెజార్టీ రాలేదని తెలిపారు. ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందని, రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చని అంచనా వేసిన రాజ్‌గోపాల్‌ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..