Bandi Sanjay: వారి నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం.. బండి సంజయ్ సంజయ్ సంచలన ట్వీట్..

|

Sep 09, 2022 | 12:00 PM

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. తమిళిసై కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: వారి నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం.. బండి సంజయ్ సంజయ్ సంచలన ట్వీట్..
Bandi Sanjay
Follow us on

Bandi Sanjay on Telangana Govt: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు హీటెక్కెస్తున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. తమిళిసై కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయకపోవడం దగ్గర్నుంచి.. ఈ మధ్య బాసర ట్రిపుల్‌ ఐటీలో పర్యటన వరకు అన్ని అంశాల్లోనూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను డైరెక్ట్‌ ఎటాక్ చేశారు తమిళిసై. ఎట్‌ హోంకి వస్తానని సీఎం ఎందుకు రాలేదో చెప్పలేదన్నారు. రాజ్‌భవన్‌ ఏమన్నా అంటరాని స్థలామా అని ప్రశ్నించారు. ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పనిచేస్తానని చెప్పారు. రాజ్‌భవన్ ప్రజాభవన్‌గా మారిందని పేర్కొన్న గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్ పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ సహా పలువురు కీలక నేతలు గవర్నర్ తీరుపై మండిపడ్డారు. తమిళిసై బీజేపీ నేతలా మాట్లాడడం మానేయాలంటూ సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకే గవర్నర్ రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చారు అంటూ కవిత విమర్శించారు. కాగా.. గవర్నర్ వ్యాఖ్యల అనంతరం ప్రతిపక్ష పార్టీలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గవర్నర్ తమిళిసై వాస్తవాలు మాట్లాడారని.. కానీ టీఆర్‌ఎస్‌ గవర్నర్‌ను బీజేపీ వ్యక్తిగా ముద్రవేసి, తెలంగాణ ప్రథమ పౌరురాలిని అవమానిస్తోందంటూ ట్విట్ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలకు మహిళలను గౌరవించడం గానీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పాటించడం గానీ తెలీదు. కల్వకుంట్ల రాజ్యాంగ అనుచరుల నుంచి ఇంకా ఏం ఆశించగలం? గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్.. భారత రాజ్యాంగం ఆదర్శాలను అమలు చేయాలని, గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని అడుగుతున్నారంటూ బండి సంజయ్ ట్విట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం.. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాకుండా వివక్ష, అంటరానితనం, మాట్లాడే హక్కును హరిస్తుందంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం