Tiger Fear – Telangana: ఆ పులి చిక్కదు.. దొరకదు.. అభయారణ్యంలో మాటు వేసిన బెబ్బులి ఉత్తర తెలంగాణ జిల్లాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కొన్ని గ్రామాలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తుంది.. పులి భయంతో రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడం మానుకోగా.. పశువులను మేతకు తీసుకెళ్లాలంటే కాపర్లు వణికి పోతున్నారు.. ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులను బలి తీసుకున్న ఆ పెద్దపులి పచ్చని పల్లెల్లో ప్రశాంతత కరువయ్యేలా చేసింది.. పులిని ప్రత్యక్షంగా చూసినవారు మాత్రం వారికిది పూర్వ జన్మని భావిస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ఊళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు, కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలను బెబ్బులి బెంబేలెత్తిస్తుంది.. రోజుకో చోట పులి గాండ్రింపులు వణుకు పుట్టిస్తున్నాయి.. అభయ ఆరణ్యంలో మేతకు వెళ్లిన పశువులు పులి పంజాకు బలవుతున్నాయి.. వరంగల్ పరిధిలోని మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో గత నెల రోజుల నుండి పులి సంచారం తీవ్ర భయాందోళన కలిగిస్తుంది.. ఈ నాలుగు జిల్లాల పరిదిలో ఇప్పటివరకు 14 పశువులు, 4 లేగ దూడలు, రెండు అడవి దున్నలు పులి పంజాకు బలయ్యాయి. అదృష్టావశాత్తు ఇప్పటివరకు ఎక్కడా ఊళ్ళలోకి ప్రవేశించలేదు. మనుషుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగలేదు. రోజుకోచోట పులిని చూసి హదలెత్తిపోతున్న స్థానికులు వారికిది పునర్జన్మని భావిస్తున్నారు. కొందరు పులి కంటబడకుండా చెట్ల చాటున దాక్కొని ఆ పులిని సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. పులిపంజాతో ఊళ్లన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అడవులన్నీ జల్లెడపట్టిన పెద్ద పులి ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో తిష్టవేసింది. మూడు రోజుల వ్యవధిలో నాలుగు పశువులను పొట్టన పెట్టుకుంది. పులి సంచారం నేపథ్యంలో కదిలిన అటవీశాఖ సిబ్బంది ట్రాకింగ్ కేమెరాలు ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పులి అడవిదున్నతో పాటు, ఆవును హతమార్చడం ట్రాకింగ్ కెమెరాల్లో చిక్కింది. పులి సంచారం గుర్తించిన అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి ఎవరూ వెళ్లవద్దని, పశువులను మేతకు తీసుకెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కిన దృశ్యాల ఆధారంగా మగ పులి గా గుర్తించారు. ఎటువైపు నుండి వచ్చింది. ఆ పులి గమ్యం ఎటని విచారణ జరుపుతున్నారు. పులి రాక శుభాశుచకమని అటవీశాఖ అధికారులు భావిస్తుంటే ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికి పోతున్నారు.
Also read:
Bipin Rawat Cremation:సేవకా సెలవిక !! బిపిన్ రావత్ అంత్యక్రియలు.. లైవ్ వీడియో
Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
Konijeti Rosaiah: ఆ మెటీరియల్స్‌తో మాజీ సీఎం రోశయ్య విగ్రహం తయారీ.. సూర్య శిల్పశాల మరో ఘనత..