దక్షిణాదిలో దూసుకెళ్లడంపై దృష్టి పెట్టినట్టుంది కాంగ్రెస్ పార్టీ. కర్నాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో… ఇప్పుడు ఏపీపైనా కన్నేసింది. అధికారం అప్పుడే అంత ఈజీ కాకపోయినా.. గత వైభవాన్ని మళ్లీ సాధించేలా పావులు కదపాలని చూస్తోంది. ఏపీసీసీ నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్‌పెద్దలు కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మూడు అంశాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఏపీలోనూ ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్… పార్టీని విడిచి వెళ్లిన వారికి ఆహ్వానం పలికింది. ఆ దిశగా కృషి చేయాలని.. కీలకనేతలందరినీ మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని… పీసీసీ నాయకులకు దిశానిర్దేశం చేసింది అగ్రనాయకత్వం. ఖర్గే నాయకత్వంలో కలిసి పనిచేద్దామని.. మాజీ నేతలందరికీ పిలుపునిచ్చారు ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.
ఏపీలో పార్టీని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చేందుకు.. కాంగ్రెస్ వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లోపు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా ప్లాన్ రెడీ చేస్తోంది. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూనే…రాష్ట్రంలో గత పదేళ్ల పాలననూ ఎండగట్టాలని చూస్తోంది.
గ్యారెంటీలతో ప్రత్యర్థులకు గట్టి షాక్‌లు ఇస్తూ వస్తున్న కాంగ్రెస్.. ఏపీలోనూ అదే ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది. తెలంగాణలో ఆరు గ్యారెంటీల ప్లాన్ కూడా సక్సెస్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఏపీలోనూ కాంగ్రెస్ గ్యాంరెటీలపై చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..