Big News Big Debate LIVE: కాంగ్రెస్‌ గేట్లు బార్లా తెరిచిందా?.. పవర్‌ బ్రోకర్లే పార్టీ మారతారంటూ బీఆర్ఎస్

|

Mar 29, 2024 | 7:13 PM

తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఊపందుకుంది. బీఆర్ఎస్‌లోని అత్యంత సీనియర్‌ నాయకులే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దానం నాగేందర్‌ చేరగా. తాజాగా రాజ్యసభ సభ్యులు కేకే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కూతురు కావ్యతో..

Big News Big Debate LIVE: కాంగ్రెస్‌ గేట్లు బార్లా తెరిచిందా?.. పవర్‌ బ్రోకర్లే పార్టీ మారతారంటూ బీఆర్ఎస్
Big News Big Debate
Follow us on

తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఊపందుకుంది. బీఆర్ఎస్‌లోని అత్యంత సీనియర్‌ నాయకులే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దానం నాగేందర్‌ చేరగా. తాజాగా రాజ్యసభ సభ్యులు కేకే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కూతురు కావ్యతో కలిసి పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే హస్తం పెద్దలతో చర్చలతో జరిపారు. అయితే వలసలపై పార్టీల మధ్య మాటలయుద్ధం రాజుకుంది.

బీఆర్‌ఎస్‌లో 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంతింటిలాంటి కాంగ్రెస్‌కు తిరిగి చేరుకుంటున్నానన్నారు..ఎంపీ కే.కేశవరావు. తన 85 ఏళ్ల జీవితంలో 65 ఏళ్లపాటు ప్రజల్లోనే ఉన్నానన్నారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని..బాధతోనే బీఆర్‌ఎస్‌ను వీడుతున్నానన్నారు కేకే. కాంగ్రెస్‌ మద్దతుతోనే తాను మొదటిసారి రాజ్యసభకు ఎంపికయ్యానన్నారు..కేకే. కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎంతో చేసిందన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ని వీడే నాయకులపై సంచలనవ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీ వీడుతున్నారని.. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు. ఇప్పుడు పార్టీని వదిలి వెళ్లిన వాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానివ్వమని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌లో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్‌.. ఇప్పుడు బ్లాక్‌ మెయిల్‌ చేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.