ఏపీలో పొత్తు రాజకీయం మహారంజుగా సాగుతోంది. కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, భీమవరంలో బీజేపీ రాజకీయ తీర్మానం పూర్తి భిన్నంగా ఉండటం పొలిటికల్ హైటెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. బీజేపీ కాదంటే ఒంటరి పోరు, అదీ కాకపోతే కొత్త పొత్తు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయి. అటు బీజేపీ కూడా భావసారూప్యత ఉన్న పార్టీలు వస్తే సరే లేదంటే ఒంటరిపోరే అంటూ కాలు దువ్వుతోంది. ఏపీ రాజకీయాల్లో మిగతా పార్టీల సంగతెలా పొత్తులపై జనసేన చేసే కామెంట్లు రచ్చ చేస్తుంటాయి.
గతంలోనే పొత్తులపై మూడు ఆప్షన్లు ఇచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం లేదంటే జనసేన ఒంటరిగా పోరులో నిలబడటం, అదీ కాకపోతే 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వాటికి భిన్నంగా కొత్తగా ప్రకటన చేశారు. ప్రస్తుతానికి బీజేపీతోనే ఉన్నామంటూనే కొత్త చర్చకు తావిచ్చారు పవన్‌కల్యాణ్. పవన్ కొండగట్టులో అంజన్న సాక్షిగా ఆసక్తికర ప్రకటన చేస్తే భీమవరంలో బీజేపీ చేసిన ప్రకటన మరింత కాక రేపుతోంది. ఎక్కడా జనసేన పేరు లేదు పైగా వ్యతిరేక ఓటు చీలనివ్వంటూ చేసిన పవన్ ప్రకటనకు భిన్నంగా బీజేపీ పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేసింది. పొత్తులపై బీజేపీ ఎంపీ మరో సంచలన వ్యాఖ్య కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే అటు బీజేపీ విష్ణువర్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకాలం పొత్తులపై ఆశలు పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రచారం చేసిన పార్టీలు తమ తీరు మార్చుకోవాలంటోంది బీజేపీ. తొందరెందుకు కొత్త ఆప్షన్లు లేకపోలేదంటూ సంకేతాలు ఇస్తోంది జనసేన. పేరుకే పొత్తులో ఉన్నా ఏకాభిప్రాయం లేని పార్టీల ప్రకటనలు ప్రస్తుతానికి అయితే గందరగోళంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి..