Big News Big Debate: తెలంగాణ యుద్ధం.. తగ్గేదేలే..! ఎవరికి ఎవరు బీ టీమ్‌గా మారారు?

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో అసలైన ఆరోపణల యుద్ధం మొదలైంది. మూడురోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు కూడా రాహుల్‌ గాంధీ బీఆర్ఎస్‌- బీజేపీలు లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించారు. అంతే స్పీడుగా ప్రత్యర్ధుల నుంచి కౌంటర్లు కూడా పడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ - బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు రాహుల్‌. బీజేపీకి బీఆర్ఎస్‌ బీ టీమ్‌ మారిందన్నారు.

Big News Big Debate: తెలంగాణ యుద్ధం.. తగ్గేదేలే..! ఎవరికి ఎవరు బీ టీమ్‌గా మారారు?
Big News Big Debate

Updated on: Oct 19, 2023 | 7:00 PM

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో అసలైన ఆరోపణల యుద్ధం మొదలైంది. మూడురోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు కూడా రాహుల్‌ గాంధీ బీఆర్ఎస్‌- బీజేపీలు లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించారు. అంతే స్పీడుగా ప్రత్యర్ధుల నుంచి కౌంటర్లు కూడా పడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ – బీఆర్‌ఎస్‌ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు రాహుల్‌. బీజేపీకి బీఆర్ఎస్‌ బీ టీమ్‌ మారిందన్నారు. వీరికి MIM కూడా జత కలిసిందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాము ఎవరికి బీ టీమ్‌ కాదని.. కాంగ్రెస్ పార్టీయే సీ టీమ్‌గా వ్యవహరిస్తుందన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. సీ అంటే చోర్‌ టీమ్‌ అని అర్ధమన్నారు కేటీఆర్‌. మరోవైపు ఎవరు ఎవరితో ఉన్నారో, ఎవరితో గతంలో పొత్తు పెట్టుకున్నారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ చేశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

ఇక తెలంగాణలో కుటుంబపాలన, దొరల పాలన నడుస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్‌గాంధీ. అయితే ప్రియాంక, రాహుల్‌ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్‌.

ఇక తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు రాహుల్‌ గాంధీ. ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. అటు ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి రద్దు చేస్తామంటున్నారు రాహుల్‌. అవినీతికి కేరాఫ్‌ అడ్రసే కాంగ్రెస్‌ నేతలున్నారు కేటీఆర్‌. ఒకప్పుడు ఓటుకు నోటు… ఇప్పుడు సీటుకు రేటెంత రెడ్డిని పక్కనపెట్టుకుని ఆరోపణలు చేయడం చూస్తేంటే నవ్వొస్తుందన్నారు కేటీఆర్‌.

రాహుల్‌ తన పర్యటనలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ప్రయోగిస్తున్నారు. నిన్న ప్రియాంక తాజాగా రాహుల్‌ కూడా తమ కుటుంబానికి రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉందని.. పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామంటూ సెంటిమెంట్‌ జోడించారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..