BJYM National Body : భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. బుధవారం నాడు పార్టీ యువమోర్చా విభాగానికి సంబంధించి ఉపాధ్యక్షులు సహా కార్యదర్శులు, ట్రెజరర్, వివిధ విభాగాల ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ జాతీయ యువమోర్చా కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు లభించింది. జాతీయ కార్యదర్శిగా తెలంగాణకు చెందిన షెహజాదీ సయ్యద్‌ను నియమించారు. అలాగే బీజేపీ యువమోర్చా కోశాధికారి(ట్రెజరర్)గా సాయి ప్రసాద్‌ను నియమించారు.
బీజేపీ యువమోర్చా కార్యవర్గం వివరాలు..
ఇక బీజేపీ యువమోర్చా జాతీయ ఉపాధయక్షులుగా ఏడుగురుని నియమించారు. ఉపాధ్యక్షులుగా నియామకైన వారిలో అనూప్ కుమార్ సాహా(ఎమ్మెల్యే)-పశ్చిమబెంగాల్, మధు శేఖర్ దేశాయ్-మహారాష్ట్ర, మనీష్ సింగ్ – బిహార్, అర్పిత అపరాజిత – ఒడిశా, రామ్ సత్పుతే(ఎమ్మెల్యే) – మహారాష్ట్ర, అభినవ్ ప్రకాశ్ – ఉత్తర్ ప్రదేశ్, నేహా జోషి – ఉత్తరాఖండ్. జాతీయ జనరల్ సెక్రటరీలుగా ముగ్గురిని నియమించారు. రాజు బిస్తా(ఎంపీ) – పశ్చిమ బెంగాల్, రోహిల్ చాహల్ – ఢిల్లీ, వైభవ్ సింగ్ – ఉత్తరప్రదేశ్. జాతీయ కార్యదర్శులుగా ఏడుగురిని నియమించారు. శ్యామ్ రాజ్ – కేరళ, షెహజాది సయ్యద్ – తెలంగాణ, రవి భగత్ – ఛత్తీస్‌ఘడ్, తేజేందర్ పాల్ సింగ్ బగ్గ – ఢిల్లీ, గౌరవ్ గౌతమ్ – హర్యానా, అరుణ్ జ్యోతి హజారిక – అస్సాం, నింగ్తౌజమ్ – మణిపూర్. ట్రెజరర్‌గా సాయి ప్రసాద్ – తెలంగాణ. ఆఫీస్ ఇన్‌ఛార్జిగా వినీత్ త్యాగి – ఢిల్లీ, మీడియా ఇన్‌ఛార్జిగా అమన్‌దీప్ సింగ్ – చండీఘడ్, సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా కపిల్ పర్మర్ – హిమాచల్ ప్రదేశ్, పాలసీ, రీసెర్చ్ విభాగ ఇన్‌ఛార్జిగా వరుణ్ ఝవేరి – గుజరాత్.
బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఈ కార్యవర్గ నియామకాన్ని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తేజస్వి సూర్య.. కర్ణాటక నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Also read:
Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..