Telangana BJP: మొదలైన బీజేపీ మిషన్ మీటింగ్.. 90 అసెంబ్లీ సీట్లే టార్గెట్‌గా కార్యాచరణ.. అభ్యర్థుల వేటలో జాయినింగ్స్ కమిటీ..

|

Dec 29, 2022 | 1:09 PM

తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావాలంటే అవ‌స‌ర‌మైన కార్యచ‌ర‌ణను రూపొందిస్తున్నారు. 90 సీట్లు గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా మిష‌న్ 90ని సిద్ధం చేశారు .

Telangana BJP: మొదలైన బీజేపీ మిషన్ మీటింగ్.. 90 అసెంబ్లీ సీట్లే టార్గెట్‌గా కార్యాచరణ.. అభ్యర్థుల వేటలో జాయినింగ్స్ కమిటీ..
Telangana BJP
Follow us on

మిషన్‌-90..! టార్గెట్‌-2023.! తెలంగాణలో కాషాయజెండా ఎగరేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మిషన్‌ 90 మీటింగ్‌ను ప్రారంభించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. 90 సీట్లలో గెలవడమే టార్గెట్‌గా కార్యాచరణ రూపొందిస్తున్నారు. బల‌హీన‌మైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. పార్టీ బ‌ల‌హీనంగా ఉండి బ‌ల‌మైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వివ‌రాలు ఇప్పటికే రెడీ చేశారు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాలు, ప్రణాళిక‌లు, ప్రత్యర్థి పార్టీల బ‌ల‌హీన‌త‌లు, విధాన ప‌ర‌మైన హామీల్లాంటి అంశాలతో డిటైల్డ్ రిపోర్ట్ రూపొందించారు. బీజేపీ చేరికల కమిటీ కూడా దూకుడు పెంచింది.

బలమైన లీడర్స్ కోసం వేట మొదలుపెట్టింది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఇప్పటికే లిస్ట్‌ ఔట్ చేసినట్లు తెలుస్తోంది. బలమైన నేతలు వస్తామంటే పార్టీ తలపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న సంకేతాలు ఇస్తున్నారు. అవసరమైతే టికెట్‌పై హామీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం