Bharat Biotech: రాములోరికి భారత్ బయోటెక్ భారీ విరాళం.. నేరుగా భద్రాద్రి ఆలయ ఖాతాలో జమ..

భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళాన్ని భారత్ బయోటెక్ కంపెనీ యాజమాన్యం అందించింది.

Bharat Biotech: రాములోరికి భారత్ బయోటెక్ భారీ విరాళం.. నేరుగా భద్రాద్రి ఆలయ ఖాతాలో జమ..
Bhadradri Temple

Updated on: May 16, 2022 | 2:44 PM

Bharat Biotech donated Bhadradri Temple: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం.. భారత్ బయోటెక్ కంపెనీ భద్రాద్రి ఆలయానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.కోటి విరాళాన్ని కంపెనీ యాజమాన్యం అందించింది. ఈ మేరకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిత్యాన్నదాన పథకం నిమిత్తం నేరుగా విరాళం అందించినట్లు దేవస్థానం తెలిపింది.

కాగా.. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయంలో ప్రతిరోజు అన్నప్రసాదాన్ని అందిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు పలువురు విరాళాన్ని అందిస్తుంటారు. ఈ క్రమంలో ఎటువంటి సమాచారం అందించకుండానే భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధులు కోటి రూపాయల విరాళాన్ని స్వామి వారి ఖాతాలో జమ చేసినట్లు భద్రాద్రి దేవస్థానం పేర్కొంది.

కాగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా నియంత్రణకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Hyderabad: కారు నడపవద్దన్న భర్త.. మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఎంత పని చేసిందంటే..

Telangana: వేములవాడ రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్.. తల్లికి మద్యం తాగించి దారుణం