మావోయిస్టులు కొత్త తరహాలో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పాటు.. నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిసేలా ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అంటున్నారు పోలీసులు. అయితే, మరోవైపు మావోయిస్టులు మాత్రం చాపకింద నీరులా తమ క్యాడెర్‌ను పెంచుకుంటున్నారు. దీనికి తోడు కొత్త తరహాలో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో దొరికిన కొన్ని సాక్షాలు ఇవే చెబుతున్నాయి.
ములుగు జిల్లాలో బీర్ బాటిల్స్ ఐఈడీ బాంబులు లభించడం ఆందోళనకు గురి చేస్తోంది. కూంబింగ్‌కు వెళ్లే పోలీసులే టార్గెట్‌గా వీటిని అమర్చినట్లుగా తెలుస్తోంది. వెంకటాపురం పామునూర్ అడవిలో బీర్ బాటిల్స్ ఐఈడీతో మందుపాతరను ఏర్పాటు చేశారు. అనుమానంతో స్పెషల్ పార్టీ, సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ తనిఖీలు చేయగా.. మందు పాతరగా లభించింది. వెంటనే మందుపాతరను నిర్వీర్యం చేశారు.
మొత్తం ప్రాంతాలన్ని పరిశీలించిన పోలీసులకు నివ్వరపోయే వస్తువులు లభించాయి. ఇందులో కరెంట్ వైర్లు, బీర్ బాటిల్స్, బోల్టులు, కాపర్ సీల్, గన్ పౌడర్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే.. కొత్త తరహాలో తయారు చేసిన బీర్ బాటిల్ మందుపాతర పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే మందుపాతర నిర్వీర్యం చేశారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం