Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో టెన్షన్‌ వాతావరణం ఎందుకుంటోంది..? క్యాంపస్‌లో అసలేం జరుగుతోంది?

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులంతా..

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో టెన్షన్‌ వాతావరణం ఎందుకుంటోంది..? క్యాంపస్‌లో అసలేం జరుగుతోంది?
Basara Iiit
Follow us

|

Updated on: Aug 25, 2022 | 8:23 AM

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బుధవారం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులంతా హాస్టల్‌ రూమ్స్‌కే పరిమితం కావడంతో, క్యాంపస్‌లో గంభీర వాతావరణం కనిపించింది. మరోవైపు అధికారుల ఆంక్షలు కూడా పనిచేశాయి. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు పెట్టొద్దంటూ మేనేజ్‌మెంట్‌ కఠిన నిబంధనలు విధించడంతో క్యాంపస్‌లో పరిస్థితి తుఫాను ముందు నిశ్శద్ధంలా మారింది. అయితే, ఆంక్షల మధ్యే క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. ఆత్మహత్య చేసుకున్న సురేష్‌ ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళులర్పించారు. అధికారుల ఆంక్షలను లెక్క చేయకుండా క్యాంపస్‌లో భారీ ర్యాలీ తీశారు.

పోలీస్ వాహనం ధ్వంసం ఘటనలో ఐదుగురు విద్యార్ధులపై కేసులు నమోదు చేశారు. 341, 353, 332, 427 r/w, 34 IPC సెక్షన్ల ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు పోలీసులు. దాంతో విద్యార్ధులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ క్యాండిల్‌ ర్యాలీలో నినాదాలు చేశారు విద్యార్థులు. అలాగే సురేష్‌ మృతికి కారణమైన అధికారులను పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. అక్రమ కేసులు నమోదుచేసి తమను క్యాంపస్‌ నుంచి వెళ్లగొట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్ధులు. ఇద్దరు విద్యార్థుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో క్యాంపస్‌లో మళ్లీ ఉద్రిక్తంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి