Telangana News: కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు

|

Apr 03, 2021 | 8:47 AM

కరోనా కాటు.. అంతా ఇంతా అని చెప్పలేం. వైరస్‌ బారినపడి సామాన్యుడి నుండి బిలియనీర్‌ వరకు నాన ఇక్కట్లు పడ్డవారిని చూశాం. ఇందులో ప్రైవేటు ఉపాధ్యాయుల..

Telangana News:  కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు
Barber Kind Nature
Follow us on

కరోనా కాటు.. అంతా ఇంతా అని చెప్పలేం. వైరస్‌ బారినపడి సామాన్యుడి నుండి బిలియనీర్‌ వరకు నాన ఇక్కట్లు పడ్డవారిని చూశాం. ఇందులో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి కడు దయనీయంగా వుందనే చెప్పవచ్చు. గత మార్చి లాక్ డౌన్ నుంచి ఈ రోజు వరకు పలు కుటుంబాల్లో ఇల్లు గడవని దుస్థితి నెలకొంది. వీరి దయనీయ స్థితిని గమనించిన జనగాం జిల్లాకి చెందిన ఓ క్షౌరశాల యజమాని, ప్రవేట్ ఉపాధ్యాయులకు ఉచితంగా కటింగ్, గడ్డం చేస్తూ తన ఉదారతను చాటుతున్నాడు.

జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో గల సోమేశ్వర హెర్ కటింగ్ సెలూన్ యజమాని నరేష్.. గత 20 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నాడు. కాగా గతంలో ఎన్నాడూ లేని విధంగా ప్రవేట్ ఉపాధ్యాయుల దీన స్థితిని గమనించిన నరేష్ ఈ నిర్ణయానికొచ్చాడు. అయితే ఈ నరేష్ షాపు కొచ్చే వారిలో ఎక్కువ మంది ప్రైవేటు టీచర్స్‌ ఉన్నారు. కొద్ది రోజులుగా వారు తన షాపుకు రావడం తగ్గింది. కారణం..ఏంటా అని ఆరాతీయగా..ప్రవేట్ పాఠశాలలు నడవక, వీరికి జీతాలు లేక పస్తులు ఉండే గడ్డు పరిస్థితి వుందని నరేష్ దృష్టికి వచ్చింది. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న నరేష్‌ ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఒకప్పుడు వాళ్ల డబ్బులతో తన షాపు బాగా నడిచింది. కానీ, ఇప్పుడు వారు కష్టాలలో ఉంటే..డబ్బులు తీసుకోవడం భావ్యం కాదని భావించాడు. అందుకే వారందరికీ ఉచితంగా కటింగ్, గడ్డం చేస్తున్నాడు. ఈ ఉచిత సేవకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని చెప్పాడు బార్బర్‌ నరేష్.

తమకు జీతాలు లేక,,ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు ప్రైవేటు టీచర్లు. నరేష్‌ని ఎంతగానో అభినందిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నరేష్‌ చేస్తున్నపనిని ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: రైతులు బీ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చాయా ? ఇలా చెక్ చేసుకోండి..

కరోనాను సిక్సర్ కొట్టాలి సచిన్.. ట్వీట్ చేసిన పాకిస్తాన్ మాజీ పేస్ బౌల‌ర్ వ‌సీం